Home

»

Latest News

Laila: లైలా పట్టుబట్టారు.. 22 ఏళ్ళ తర్వాత అదృష్టవంతులుగా తెలుగు ప్రేక్షకులు 

May 7, 2026 3:23PM

 


మాఘమాసం ఎప్పుడొచ్చిందో అని ఆడిపాడి పెళ్లీడుకొచ్చిన యువతీ, యువకులు అర్జెంట్ గా పెళ్లి చేసుకునేలా చేసింది లైలా(Laila)..ఇప్పుడు మళ్ళీ అలాగే చేయాలనే ఉద్దేశ్యంతో సెకండ్ ఇన్నింగ్స్ లో 'గోదారి గట్టుపైన'(Godari Gattupaina)అనే చిత్రంతో రేపు థియేటర్స్ లో అడుగుపెడుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక రీసెంట్ గా  హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకలో లైన తన ఉత్సాహభరితమైన ప్రసంగంతో  ఆకట్టుకున్నారు.


లైలా మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకులు చూపించే ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేను. తెలుగు నా మాతృభాష కాకపోయినా, ఇక్కడి వారు నన్ను తమ ఇంటి అమ్మాయిలా ఆదరించారు. మళ్ళీ మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది.  గోదావరి తీర ప్రాంతంలోని గ్రామీణ వాతావరణం, అక్కడి మనుషుల మధ్య ఉండే అనుబంధాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
 ఒక పవర్‌ఫుల్, ఎమోషనల్ క్యారక్టర్ ని పోషించాను. నా  కెరీర్‌లో ఇది ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుంది. 


Also read: Allu arjun: మాటలు మారాయి.. రాకా తాజా న్యూస్ నిజమేనా!

రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు పాత రోజులు గుర్తొచ్చాయి. అక్కడి భోజనం ఆతిథ్యం అద్భుతం. దర్శకుడు సుభాష్ చంద్ర నేను నటించాలని పట్టుబట్టి మరి ఒప్పించాడని చెప్పుకొచ్చారు. లైలా 22 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తుంది. జగపతి బాబు, సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, రాజీవ్ కనకాల కీలక రోల్స్ లో కనిపిస్తున్నారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com