నాగార్జున కోసం రంగంలోకి జిమ్ సర్బ్.. నాకు డబ్బు పిచ్చి లేదు
on Aug 27, 2024
యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై హైడ్రా చర్యల నేపథ్యంలో ఆయన అభిమానులు కొంచం నిరుత్సాహ లో పడిన విషయం తెలిసిందే. ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేశారనేది కూడా అభిమానుల ఆరోపణ. ఇక ఆ విషయాన్ని పక్కన ఉంచితే నాగ్ అభిమానుల డల్ నెస్ పోగొట్టడానికి కుబేర టీం తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించింది.
నాగ్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ కుబేర. తమిళ అగ్ర హీరోల్లో ఒకడైన ధనుష్ కూడా మరో హీరోగా స్క్రీన్ మీద మెరవనుండటంతో అంచనాలు ఒక రేంజ్ లోనే ఉన్నాయి. రీసెంట్ గా కుబేర లో ముఖ్య పాత్ర పోషిస్తున్న జిమ్ సర్బ్ ఫస్ట్ లుక్ ని మేకర్స్ విడుదల చేసారు. జిమ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చెయ్యగా నోట్ల కట్ట మధ్య స్టైల్‌గా నిల్చున్న జిమ్ పోస్టర్ ఇప్పుడు సినిమాపై మరింత ఆసక్తిని అటు అభిమానుల తో పాటు ప్రేక్షకుల్లోను కలిగిస్తుంది. అంతే కాకుండా జిమ్ క్యారక్టర్ ఎలా వుండబోతుందనే చర్చ కూడా సోషల్ మీడియా
వేదికగా జరుగుతుంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం విడుదలైన నాగ్ ఫస్ట్ లుక్ కూడా ఒక రేంజ్ లో అదిరిపోయింది. కట్టల కట్టల గా డబ్బులు ఉన్న ఒక పెద్ద కంటైనర్ ముందు నాగార్జున గొడుగు వేసుకొని ఉంటాడు.
ఆ తర్వాత అక్కడినుంచి వెళ్లబోతుంటే ఇంకో నోటు కనపడుతుంది. కానీ దాన్ని ముట్టుకోకుండా తన పర్సులో ఉన్న ఇంకో నోటు తీసి కంటైనర్ లోని డబ్బుల్లో ఉంచుతాడు. దీంతో నాగ్ కి డబ్బులు అవసరం లేదని తెలుస్తుంది. ఇప్పుడు రిలీజ్ చేసిన జిమ్ లుక్ మాత్రం డబ్బు పిచ్చి ఉన్నోడు గా ఉంది.దీంతో నాగ్, జిమ్ కి మధ్య డబ్బు గురించి వార్ ఉంటుందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇక గతంలో విడుదలైన ధనుష్ లుక్ కూడా ఒక రేంజ్ లోనే ఉంది. ఇక కుబేర లో రష్మిక హీరోయిన్ గా చేస్తుండగా శేఖర్ కమ్ముల దర్శకత్వాన్ని వహిస్తున్నాడు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కి సిద్ధం అవుతుంది.
Also Read