
వరుస హిట్స్ మోడ్ లో ఉన్న కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)ఈ నెల 24 న చెన్నై లవ్ స్టోరీతో థియేటర్స్ లో అడుగుపెడుతున్నాడు. మ్యాడ్ మూవీ బ్యూటీ గౌరీ ప్రియ హీరోయిన్ కావడం,ప్రచార చిత్రాలు బాగుండటంతో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన 'చెన్నై లవ్ స్టోరీ' ప్రెస్ మీట్‌లో చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆయన మాట్లాడుతు గడిచిన ఈ ఐదేళ్ల సినీ ప్రయాణంలో నేను ఏం సంపాదించుకున్నాను అని వెనక్కి తిరిగి చూసుకుంటే, ప్రేక్షకుల నుంచి లభించిన అపారమైన ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. ఈ ఐదేళ్ల కాలంలో తిట్టారు, పొగిడారు, కొట్టారు. ఇన్ని జరిగినా, ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒకచోట 'కిరణ్ అబ్బవరం' అనే పేరు గురించి ఒక చిన్న చర్చ జరుగుతుందంటే, అదే తన జీవితంలో సాధించిన అతిపెద్ద సక్సెస్ ,నా అదృష్టం. సినిమాపై ఉన్న పిచ్చితో, నిద్ర లేచినప్పటి నుంచి మంచి సినిమాలు చేయాలనే తాపత్రయమే నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. అంతేకాకుండా, భవిష్యత్తులో కేవలం హీరోగానే కాకుండా, దర్శకత్వం వైపు కూడా అడుగులు వేసే ఆలోచన ఉందంటూ చెప్పుకొచ్చాడు.
also read: శ్రీలీలకి మరో భారీ షాక్.. తప్పుకుంటుందా, తప్పిస్తున్నారా!
ఇక బాక్సాఫీస్ క్లాష్ గురించి వస్తున్న వార్తలపై కూడా కిరణ్ అబ్బవరం ఈ ప్రెస్ మీట్‌లో చాలా ధీటుగా స్పందించారు. గతంలో కోలీవుడ్ పెద్ద సినిమాలు తన చిత్రాల రిలీజ్ సమయానికి పోటీగా వచ్చి కలెక్షన్ల పరంగా ఇబ్బంది పెట్టిన మాట నిజమేనని ఆయన అంగీకరించారు. అందువల్లనే ఈసారి రాబోయే 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రానికి సోలో రిలీజ్ ప్లాన్ చేయాలని నిర్మాత సాయి రాజేష్‌ను మైక్‌లోనే ఓపెన్‌గా కోరడం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' జూలై 24వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండటంతో, ఆ సినిమా వస్తే కిరణ్ సినిమా వాయిదా పడుతుందా అనే ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై ఆయన స్పందిస్తూ, తమిళనాడు నుండి ఎలాంటి పెద్ద సినిమాలు పోటీకి వచ్చినా తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ సినిమా కంటెంట్‌పై తమకు 100 శాతం గట్టి నమ్మకం ఉందని, ప్రకటించిన తేదీకే థియేటర్లలోకి వస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రొడక్షన్ సైడ్ నుండి ఎస్కేఎన్, సాయి రాజేష్, ధీరజ్ లాంటి సాలిడ్ నిర్మాతలు ఉండటంతో థియేటర్ల కొరత కానీ, ఓపెనింగ్స్ టెన్షన్ కానీ తమకు అస్సలు లేదని తేల్చి చెప్పారు.
kiran abbavaram, Vijay, chennai love story, gowri priya






