ENGLISH | TELUGU  

'క' ట్రైలర్.. ఇదసలు కిరణ్ అబ్బవరం సినిమానేనా!

on Oct 25, 2024

కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) అప్ కమింగ్ మూవీ 'క' (KA). శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్-సందీప్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేయడంతో పాటు, కిరణ్ ఖాతాలో మంచి విజయం పడటం ఖాయమనే నమ్మకాన్ని కలిగించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. (KA Trailer)

'క' మూవీ ట్రైలర్ తాజాగా విడుదల చేశారు మేకర్స్. 2 నిమిషాల 45 సెకన్ల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. చుట్టూ ఎత్తయిన కొండలు ఉండి, మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి పడే ఒక ఊరికి పోస్ట్ మ్యాన్ గా వాసుదేవ్(కిరణ్) వెళ్తాడు. ఓ వైపు ఉద్యోగం, మరోవైపు ప్రేమ కథతో సాఫీగా సాగిపోతున్న వాసుదేవ్ జీవితం.. ఒక్కసారిగా ఊహించని మలుపులు తిరుగుతుంది. అసలు వాసుదేవ్ ఎవరు? ఆ ఊరికి ఎందుకు వచ్చాడు? ఇతరులకు వచ్చిన ఉత్తరాలు రహస్యంగా చదువుతున్నాడా? ఒక ఉత్తరం చదవడం వల్ల, అతనికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఉత్తరాలు పంచాల్సిన వ్యక్తి, కత్తి పట్టి ప్రాణాలు తీయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వంటి ఆసక్తికర అంశాలతో సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ కలిగేలా ట్రైలర్ ఉంది. ఇక ట్రైలర్ లో సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన బలంగా నిలిచాయి.

కెరీర్ స్టార్టింగ్ లో 'రాజావారు రాణిగారు', 'SR కళ్యాణమండపం' వంటి సినిమాలతో ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం.. ఆ తరువాత వరుస పరాజయాలతో నిరాశపరిచాడు. సరైన హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. 'క' ట్రైలర్ చూస్తుంటే, ఈ సినిమాతో కిరణ్ కమ్ బ్యాక్ ఇచ్చేలా ఉన్నాడు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.