TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

యాంకర్ శ్యామలకి షాక్ ఇచ్చిన కిరాక్ ఆర్పీ..రవీందర్ రెడ్డి, భార్గవ్ రెడ్డి చేసింది నిజమే కదా

Oct 10, 2024 5:33PM

జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారాప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్ననటుడు కిరాక్ ఆర్పీ(kiraak rp).ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా చేస్తూ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై తనదైన స్టైల్లో వివరణ ఇస్తూ అందరి మనసులని చూరగొంటున్నాడు.

రీసెంట్ గా ప్రముఖ యాంకర్, సినీనటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిది అయినటువంటి యాంకర్ శ్యామల(anchor shyamala)మాట్లాడుతూ నాకు సినిమా అవకాశాలు రాకుండా అడ్డుకోవడంతో పాటుగా, సోషల్ మీడియాలో నోటితో చెప్పటానికి వీలు లేని విధంగా కామెంట్స్ చేస్తున్నారు. అసభ్యకరమైన ఫొటోస్ కి నా ముఖాన్ని పెడుతున్నారు.ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోయింది.మొన్ననా కళ్ళ ముందు ఒక అమ్మాయిని రేప్ చెయ్యబోయారని చెప్పుకొచ్చింది. ఈ ఆరోపణలపై ఆర్పీ మాట్లాడుతు నువ్వు ఎన్ని సినిమాల్లో చేసావని సినిమా అవకాశాలు రాకుండా చేస్తున్నారు. 

అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ ఏరియా కి వెళ్లినా కూడా నిన్ను గుర్తు పట్టరు.యాంకరింగ్ గా  కూడా పెద్దగా చేసింది ఏమి లేదు. ఆడవాళ్ళకి ఎక్కడ రక్షణ లేకుండా పోయిందో, నీ కళ్ళ ముందు ఏ ఆడపిల్లపై దాడి జరగపోయిందో  ఆధారాలతో సహా చూపించు.గత వైసిపీ ప్రభుత్వంలో వర్రా రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి నా భార్య  మీద అసభ్య కర రాతలు రాసారు.పైగా మేమిద్దరం విడాకులు తీసుకున్నామని కూడా పుట్టించారని చెప్పుకొచ్చాడు. 


 

google-ad-img