Home

»

Latest News

Toxic: టాక్సిక్ కథపై కియారా అద్వానీ షాకింగ్ కామెంట్స్.. అసలు కథ ఇదేనా!

May 29, 2026 2:34PM

 

యష్(Yash)నుంచి రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'టాక్సిక్'(Toxic). పాన్ వరల్డ్ మూవీ హోదా కోసం  దాదాపు 700 నుంచి 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన  ఈ చిత్రంపై  భారీ అంచనాలు ఉన్నాయి. కేజీఎఫ్ 2 తర్వాత యష్ చాలా గ్యాప్ తీసుకొని వస్తుండంతో  అభిమానులు అయితే  ఈ ప్రాజెక్ట్ కోసం వేయి కళ్ళతో  ఎదురుచూస్తున్నారు. యష్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జత కడుతుండగా ఆ ఇద్దరి మధ్య ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.

రీసెంట్ గా ఇచ్చిన  ఇంటర్వ్యూలో కియారా అద్వానీ(kiara Advani)మాట్లాడుతు దర్శకురాలు గీతూ మోహన్ దాస్ నాకు  టాక్సిక్  కథ చెప్పినప్పుడు  షాక్‌కి  గురయ్యాను. సాంప్రదాయ ఆలోచనలకు భిన్నంగా ఉన్న ఆ కథను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది.    'నాడియా' అనే సరికొత్త గ్రే షేడ్స్ ఉన్న క్యారక్టర్ లో చేస్తున్నాను. సాధారణంగా సినిమాల్లో చూపించే ఆడ, మగ బంధాలు, ప్రేమ,భావోద్వేగాలకి  పూర్తి భిన్నంగా ఈ కథ ఉంటుంది.   గీతూ మోహన్ దాస్ కథని నా రేట్ చేసినప్పుడు, నా  క్యారెక్టరైజేషన్  ఎంతగానో ఆశ్చర్యపరిచింది. సమాజం నిర్దేశించిన పద్ధతులకి  దూరంగా, ప్రేమలో ఒక విభిన్నమైన స్వేచ్ఛను, సరికొత్త కోణాన్ని  ఆవిష్కరిస్తుంది. నాడియా రోల్ నా ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. నిజ జీవితంలో కూడా అంత స్వేచ్ఛగా, ఎటాచ్‌మెంట్స్ లేకుండా స్వతంత్రంగా ఆలోచించడం సాధ్యమేనా అనిపించిందని చెప్పుకొచ్చింది.


Also read: shah rukh khan: బాలీవుడ్ లో కలకలం... షారుక్ ని అవమానించిన అగ్ర దర్శకుడు!

ఇటీవల సోషల్ మీడియాలో టాక్సిక్ లోని బోల్డ్ ,ఇంటిమేట్ సీన్స్ విషయంలో కియారా అభ్యంతరాలు వ్యక్తం చేసిందంటూ కొన్ని పుకార్లు షికార్లు చేశాయి. యష్‌తో నటించిన రొమాంటిక్ సీన్స్‌ ని డిలీట్ చేయాలని కియారా మేకర్స్‌ని  కోరినట్లు ప్రచారం జరిగింది. అయితే  అవి ఒట్టి రూమర్స్ అని కియారా వెల్లడి చేసింది  టాక్సిక్ రిలీజ్ ఆగష్టులో ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com