Home

»

Latest News

కీర్తి సురేష్ మూవీపై వివాదం: సోషల్ మీడియాలో బాయ్‌కాట్ సెగ‌.!

Sep 26, 2026 3:15PM

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ‘డొరొతి’ ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు ఒకవైపు ప్రశంసలు వస్తుంటే.. మరోవైపు కొన్ని సన్నివేశాలు, సినిమాలోని సున్నితమైన అంశాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతేకాదు.. కొందరు నెటిజన్లు ఏకంగా సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ పోస్టులు పెడుతున్నారు.

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ‘డొరొతి’ సెప్టెంబర్ 25న థియేటర్లలోకి వచ్చింది. 1990ల ప్రారంభంలో గ్రామీణ తమిళనాడు నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. కుల విభజనలు, హింస, పురుషత్వంపై సమాజం విధించే అంచనాలు, స్నేహం, ప్రేమ వంటి అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. కీర్తి సురేష్‌తో పాటు రిషికాంత్, సనంత్ కీలక పాత్రల్లో నటించారు.

అయితే సినిమా విడుదలైన తర్వాత అసలు చర్చ మొదలైంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని అంశాలు, LGBTQ నేపథ్యానికి సంబంధించిన ట్రీట్‌మెంట్‌పై కొందరు ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అయితే ఇలాంటి సినిమాలను ప్రోత్సహించకూడదంటూ బాయ్‌కాట్‌కు పిలుపునిస్తున్నారు.

ముఖ్యంగా సినిమా క్లైమాక్స్, చివరి భాగంలోని కొన్ని డైలాగులు సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చకు వస్తున్నాయి. సున్నితమైన అంశాన్ని దర్శకుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విధానం విషయంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వ్యతిరేకత అందరి ప్రేక్షకుల అభిప్రాయం కాదని కూడా చెప్పాలి. సినిమా కథనం, నటీనటుల పెర్ఫార్మెన్స్, రియలిస్టిక్ ట్రీట్‌మెంట్‌ను మెచ్చుకుంటున్నవాళ్లు కూడా ఉన్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శన లభించింది. అక్కడ సినిమాకు మంచి స్పందన వచ్చినట్లు రిపోర్టులు వచ్చాయి. కానీ థియేట్రికల్ రిలీజ్ తర్వాత మాత్రం సోషల్ మీడియాలో మరో రకమైన చర్చ మొదలైంది.

ఇలా ఒకవైపు ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రశంసలు.. మరోవైపు థియేటర్లలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వివాదం.. ఇంకోవైపు బాయ్‌కాట్ పిలుపులు.. ఇలా ‘డొరొతి’ చుట్టూ భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: KTR షాకింగ్ ట్వీట్.. ‘పారడైజ్’ కోసం రంగంలోకి మాజీ మంత్రి.!

 

 

 

[Keerthy Suresh Dorothy Controversy, Dorothy Movie Controversy, Keerthy Suresh Dorothy Movie, Keerthy Suresh Latest Movie, Keerthy Suresh, Dorothy Movie, Karthik Subbaraj, Dorothy Boycott, LGBTQ Controversy, Telugu Film News]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com