Home

»

Latest News

కరీనా కపూర్ ఆస్తుల విషయంలో ట్విస్ట్: ఆస్థి మొత్తం విలువ ఇంతే!

Sep 22, 2026 1:09PM


హీరోయిన్ అంటే ఏమనుకుంటున్నారు.. ఏదో తెరపై హీరో కోసం వెంటపడుతూ అతని ప్రేమ కోసం అర్రులుచాస్తూ ఉంటుందని అనుకుంటున్నారా! అది కేవలం సినిమా కోసమే.. నిజ జీవితంలో నేను హీరో కంటే కరోడ్ పతిని అని చెప్తుంది కరీనా కపూర్. అలియాస్ కరీనా కపూర్ ఖాన్. 


'బేగం ఆఫ్ పటౌడీ'గా పిలువబడే కరీనా రాయల్ లైఫ్‌స్టైల్ గురించి ప్రతిఒక్కరికీ ఆసక్తే. ఇటీవల వెలువడిన నివేదికల ప్రకారం కరీనా కపూర్ మొత్తం నికర ఆస్తి విలువ దాదాపు  485 కోట్లుగా అంచనా వేయబడింది. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే అగ్ర కథానాయికలలో ఒకరిగా నిలిచిన కరీనా, కేవలం సినిమాల ద్వారానే కాకుండా వివిధ బిజినెస్ ప్రమోషన్లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కోట్ల రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నారు.

ఆమె రెమ్యునరేషన్ వివరాల్లోకి వెళితే, ఒక్కో సినిమాకి  కరీనా సుమారు 10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల వరకు చార్జ్ చేస్తారు. ఇక సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లేదా ప్రత్యేక పాత్రల కోసం రూ. 2 కోట్ల వరకు పారితోషికం అందుకోవడం విశేషం. కేవలం వెండితెరే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు ఆమె సంపాదనలో సింహభాగం ఆక్రమిస్తున్నాయి. అనేక అంతర్జాతీయ, స్వదేశీ ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ఏడాదికి కోట్లాది రూపాయల ఆదాయాన్ని రాబడుతున్నారు. కరీనా కపూర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్లు మరియు విలాసవంతమైన నివాసాలు ఎవరినైనా ఆశ్చర్యపరుస్తాయి. ముంబైలోని అత్యంత ఖరీదైన బాంద్రా ప్రాంతంలో ఉన్న 'సత్గురు శరణ్' అనే నాలుగు అంతస్తుల భవనంలో భర్త సైఫ్ అలీ ఖాన్, పిల్లలు తైమూర్, జెహ్‌లతో కలిసి నివసిస్తున్నారు. దాదాపు 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ లగ్జరీ హోమ్ విలువ సుమారు రూ. 25 కోట్ల నుంచి రూ. 30 కోట్లుగా ఉంది. ఇది మాత్రమే కాకుండా, స్విట్జర్లాండ్‌లోని అందమైన రిసార్ట్ టౌన్‌లో కరీనాకు రూ. 33 కోట్ల విలువైన ఒక విలాసవంతమైన హాలిడే అపార్ట్‌మెంట్ కూడా ఉంది.

ఇది కుడా చదవండి: సూర్య,మణిరత్నం సంచలన కాంబో: 8 ఏళ్ల నాటి కథతో మళ్లీ రాబోతున్నారా?

ఆమె గ్యారేజీలో ఉన్న విలాసవంతమైన కార్ల కలెక్షన్ కూడా చాలా ప్రత్యేకం. రూ. 1.71 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ S-క్లాస్, రూ. 1.25 కోట్ల విలువైన BMW X7, అలాగే రూ. 95 లక్షల విలువైన ఆడి Q7, రూ. 99 లక్షల రేంజ్ రోవర్ స్పోర్ట్ కార్లు ఆమె లగ్జరీ గ్యారేజ్ లో కొలువుదీరాయి. ఇక కరీనా ఫ్యాషన్, లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్స్ కలెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె వద్ద ప్రపంచ ప్రసిద్ధి చెందిన హెర్మిస్ బిర్కిన్ (Hermès Birkin) బ్రాండ్ బ్యాగ్ ఉంది, దీని విలువ దాదాపు రూ. 13 లక్షల పైమాటే. దీంతో పాటు రూ. 8.48 లక్షల షానెల్ (Chanel) బ్యాగ్, రూ. 2.91 లక్షల డియోర్ (Dior) టోట్ బ్యాగ్స్ మరియు లూయిస్ విట్టన్ (Louis Vuitton) వంటి ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ల హ్యాండ్‌బ్యాగ్‌లు ఆమె కలెక్షన్‌లో ఉన్నాయి.

 

 

తన నటన, స్టైలిష్ లుక్స్ మరియు రాయల్ బిజినెస్ నిర్ణయాలతో బాలీవుడ్‌లో తిరుగులేని క్వీన్‌గా నిలిచిన కరీనా కపూర్, రూ. 485 కోట్ల ఆస్తులతో కరెక్ట్ డెఫినిషన్ ఆఫ్ రాయల్టీ అనిపించుకుంటున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును లగ్జరీ అసెట్స్, రియల్ ఎస్టేట్లలో ఇన్వెస్ట్ చేస్తూ ఇతర నటీమణులకు ఒక రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు.


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com