Home

»

Latest News

Kanyakumari: థియేటర్స్‌లో చూడలేదు.. ఓటీటీలో తెగ చూసేస్తున్నారని ఎందుకు 

Mar 20, 2026

 

-ఓటిటి లో రికార్డ్స్ 
-షేర్ చేస్తున్న ప్రేక్షకులు 
-ఇంతకీ ఏంటి ఆ మూవీ  

రంగం మూవీలోని 'ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే.. పిచ్చి పరుగులు తీసే వెల్లివిరిసెను వయసే' అనే సాంగ్ ని ఇప్పుడు ఓటిటి మూవీ లవర్స్ ఒక సినిమా విషయంలో విపరీతంగా పాడుకుంటున్నారు. ఈ విషయంలో పదాలు మార్చాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేకుండా పోతుంది. ఇందుకు అవకాశం కల్పించిన చిత్రం 'కన్యాకుమారి'. పైగా ఎంతో పుణ్యాన్ని కూడా మూటగట్టుకుంటుంది. ఏంటి! అసలు మీరేం చెప్తున్నారో మీకు అర్ధమవుతుందా అనే డౌట్ మీకు రావచ్చు. మరి మీ డౌట్ కి పూర్తి క్లారిఫై ఇస్తున్నాం.

కన్యాకుమారి(Kanyakumari)గత ఏడాది ఆగస్ట్ 17న థియేటర్లలో అడుగుపెట్టింది. కానీ సరైన ప్రమోషన్స్ లేకపోవడంతోనో లేక అదే టైంలో కూలీ, వార్ 2 థియేటర్స్ లోకి అడుగుపెట్టడం వలనో    
బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. అసలు కన్యాకుమారి రిలీజ్ అయ్యిందనే విషయం కూడా ఎవరికీ తెలియలేదు. కానీ సెప్టెంబర్ 17న ఓటీటీలో రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన దగ్గర్నుంచి  రోజు రోజుకి అత్యధిక వ్యూస్ ని రాబడుతు  ఇప్పుడు ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. యూత్ టార్గెట్ గా పల్లెటూరి నేపథ్యంలో ప్రేమ,జీవితం, బ్రేకప్ వంటి అంశాలతో క్లీన్ కదాంశాలతో మూవీ సాగుతుంది.  చిత్రంలో ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేదు. శ్రీచరణ్, గీత్ సైనీ జంటగా చేయగా, బలగం ఫేమ్ మురళి గౌడ్ ముఖ్యమైన క్యారక్టర్ ని పోషించాడు.  


Also read: Dhurandhar 2: ధురంధర్ 2 కి మోదీ నోట్ల రద్దుకి సంబంధం ఉందా! 

ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోస్, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుంది. . రవి నిడమర్తి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్ అయ్యాయి. సృజన్ అట్టాడ(Srujan attada) దర్శకత్వం కూడా మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. కన్యాకుమారి లవర్స్ ప్రస్తుతం ఈ మూవీ క్లిప్స్ ని  సోషల్ మీడియాలో షేర్ చేస్తు సందడి చేస్తున్నారు. మరి మీరు కూడా మిస్ అవ్వకండి. చూసాక మీరే పైన చెప్పుకున్న కన్యాకుమారి లవర్స్ లో ఒకరిగా మారతారు.

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com