
ఈ రోజుల్లో మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు దేనితో ఎక్కువ సమయం గడుపుతున్నాం? మన పక్కన ఉన్న మనుషులతో మాట్లాడటం మానేసి, మన చేతిలో ఉన్న ఫోన్‌తోనే గడుపుతున్నాం. ఒకప్పుడు కుటుంబం అంటే మాటలు, నవ్వులు, తీపి జ్ఞాపకాలు. కానీ ఇప్పుడు? ఎదురుగా కూర్చుంటారు.. కానీ ఒకరి ముఖం ఒకరు చూసుకోరు. అందరి కళ్ళు ఆ మెరిసే ఫోన్ స్క్రీన్ మీదే. ఇదే అంశంపై టాలీవుడ్ చందమామ, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చను దారితీశాయి.
సమాజంలో రోజురోజుకీ పెరిగిపోతున్న విడాకుల సంఖ్యపై కాజల్ అగర్వాల్ రీసెంట్‌గా స్పందించారు. ఈ సమాజంలో సహనం, ఓపిక తగ్గిపోవడానికి, అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెరిగి విడాకుల వరకు దారితీయడానికి ప్రధాన కారణం 'అతిగా సోషల్ మీడియా వాడటమే' అని ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
"చాలామంది దంపతులు డిన్నర్ డేట్‌కి వెళ్తారు. కానీ అక్కడ కూర్చున్నాక ఏం చేస్తారో తెలుసా? ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఇద్దరి చేతుల్లోనూ ఫోన్లు ఉంటాయి. సోషల్ మీడియా స్క్రోల్ చేసుకోవడానికే సరిపోతుంది." అని కాజల్ అన్నారు. పక్కనే జీవిత భాగస్వామి ఉన్నా, ఆన్‌లైన్ ప్రపంచంలో మునిగిపోతున్నారని, అదే ఇద్దరి మధ్య దూరానికి కారణమవుతుందని అభిప్రాయపడ్డారు.

అయితే, కేవలం నీతులు చెప్పడమే కాదు.. తన నిజ జీవితంలో కూడా ఒక క్రమశిక్షణను పాటిస్తున్నట్లు కాజల్ వెల్లడించారు. భర్త గౌతమ్ కిచ్లూతో తనకున్న బంధం ఎప్పుడూ బలంగా ఉండటానికి ఆమె ఒక సీక్రెట్ రూల్ పాటిస్తారట. వారంలో కనీసం ఒక్క రోజైనా కచ్చితంగా ఇద్దరూ కలిసి డిన్నర్‌కి వెళ్తారు. కానీ ఆ సమయంలో ఫోన్లకు అస్సలు చోటు ఉండదు. కేవలం ఇద్దరూ ఒకరికొకరు సమయం కేటాయించుకుంటారు. తమ ఆలోచనలు, సంతోషాలు, మానసిక భావాలను పంచుకుంటారు.
ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. డ్రాగన్ షూటింగ్‌పై లేటెస్ట్ అప్‌డేట్.!
కాజల్ మాటల్లో చెప్పాలంటే.. "సరైన కమ్యూనికేషన్ లేకపోవడమే దాంపత్య బంధాలు ముక్కలవ్వడానికి పెద్ద కారణం." మనం పక్కనున్న వ్యక్తికి మన మనసులోని మాటను చెప్పనప్పుడు, వారి బాధను విననప్పుడు ఆ ఖాళీని సోషల్ మీడియా భర్తీ చేస్తుంది. అక్కడ మొదలవుతుంది అసలు సమస్య.
భార్యాభర్తల మధ్య సోషల్ మీడియా దూరం పెంచుతోందంటూ కాజల్ చేసిన కామెంట్స్ ను మెజారిటీ నెటిజెన్లు సమర్ధిస్తున్నారు. ఫోన్లు పక్కన పెట్టి, ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేస్తే బంధాలు బలంగా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.
మీకు నచ్చవచ్చు: అక్కినేని అరుదైన రికార్డు.. 1955లో 7 సినిమాలు, 6 సూపర్‌హిట్.!
[Kajal Aggarwal Relationship Advice, Kajal Aggarwal Interview, Kajal Aggarwal On Divorces, Kajal Aggarwal Husband, Relationship Advice Telugu, Kajal Aggarwal, Telugu Film News, Telugu News]





