Home

»

Latest News

కాకా టైటిల్ గ్లింప్స్ అదుర్స్.. జనవరి 13 రాక 

Aug 22, 2026 9:41AM

 

ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. అభిమానులకి మాత్రం పండుగ రోజు. ఆ పండుగకి  మరింత జోష్ తెచ్చేలా ఈ రోజు చిరు 158 మూవీ టైటిల్ రిలీజ్ అయ్యింది. 'కాకా' టైటిల్ కాగా రెండు నిమిషాల యాభై నిమిషాల నిడివితో గ్లింప్స్ రిలీజ్ చేశారు. తండ్రి, కూతురు సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న మూవీ అని అర్ధమవుతుండటంతో పాటు సత్యం అనే క్యారక్టర్ లో చిరు  'ఆక్వా' కంపెనీ నడుపుతున్నట్టుగా   తెలుస్తుంది.

 చిరు ఎంట్రీకి గ్యాంగ్ లీడర్ లోని టైటిల్ సాంగ్ వాడారంటే 'కాకా' కి ఫ్లాష్ బ్యాక్ లో ఏమైనా  గ్యాంగ్ స్టార్ ఏమోనో చూడాలి.  థమన్ మరోసారి తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సత్తా చాటబోతున్నాడనే విషయం క్లియర్ గా అర్ధమవుతుంది. నుదుటున కుంకుమ ధరించి సాదాసీదా దుస్తుల్లో ఉన్న చిరు లుక్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో వైరల్ గా మారింది. 

విజువల్స్ పరంగా కూడా ఫోటిగ్రఫీ ఒక రేంజ్ లో ఉంది. ఐ లవ్ యు డాడీ అని రాసి ఉన్న కూతురి బండి తాళం చెవి నీళ్ల అడుగుభాగాన పడిపోవడం, చిరు అయస్కాంత సాయంతో ఆ కీ బయటకి తీయ్యడం ఒక ఉదాహరణ. దర్శకుడు బాబీ మేకింగ్ స్టైల్, కెమెరా పనితనం ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సంక్రాంతి కానుకగా 2027 జనవరి 13 న 'కాకా'వస్తున్నాడు.  జనగణమన, టాక్సిక్ ఫేమ్ వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నాడు.చిరంజీవి కూతురు క్యారక్టర్ లో  మలయాళ ముద్దుగుమ్మ అనశ్వర రాజన్ కనిపించబోతుంది. 


Chiranjeevi, Kaaka, Bobby, Anaswara Rajan

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com