కాకా ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్: ఫ్యాన్స్ కి పండుగే!
Nov 24, 2026 2:35PM

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న సినిమా 'కాకా'. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేయగా.. ఇప్పుడు మేకర్స్ మరో క్రేజీ అప్డేట్కు సిద్ధమవుతున్నారట. ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఆ పాట ఎప్పుడు రాబోతోంది? అభిమానులకి ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారో చూద్దాం.
'కాకా' సినిమా నుంచి వచ్చే మొదటి పాటను డిసెంబర్ చివరిలో అమెరికాలో విడుదల చేయాలని మేకర్స్ గతంలోనే ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సాంగ్ రిలీజ్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. డిసెంబర్ మొదటి వారాంతంలోనే ఫస్ట్ సింగిల్ విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే పాట విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే మేకర్స్ దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఆ ఫస్ట్ సింగల్ ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఇప్పటికే ఫుల్ ప్రాక్టీస్ లో ఉన్నట్టు సమాచారం. థమన్ సంగీతం అందిస్తుండగా 'గాడ్ ఫాదర్' తర్వాత చిరంజీవితో థమన్ చేస్తున్న మరో పూర్తి స్థాయి సినిమా కావడంతో సంగీతంపై ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా మెగాస్టార్ సినిమా అంటే పాటలు, డ్యాన్సులకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
.webp)
మరి ఈసారి థమన్ ఎలాంటి బీట్తో మెగాస్టార్‌ను చూపించబోతున్నారు? ఫస్ట్ సింగిల్ మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తుందా? లేక మెలోడీతో ఆకట్టుకుంటుందా? అన్నది చూడాలి. పాట విడుదలైతే సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి:100 డేస్ ఆడిన చివరి సినిమా అదే: కౌంట్లెస్ డబ్బులు వచ్చాయంట.. పోసాని మళ్ళీ వచ్చేసాడు!
చిరంజీవిని దర్శకుడు బాబీ సరికొత్త కోణంలో చూపించబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా తండ్రీకూతుళ్ల అనుబంధానికి ప్రాధాన్యత ఉంటుందని టాక్. ఇందులో మలయాళ నటి అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆమె క్యారక్టర్ కి కథలో మంచి ప్రాధాన్యత ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌లో ఆయనను కె. సత్యం అనే మధ్యతరగతి వ్యక్తిగా పరిచయం చేశారు. అమ్మాజీ ఆక్వా ఇండస్ట్రీస్‌లో సూపర్వైజర్గా పనిచేసే పాత్రలో మెగాస్టార్ కనిపించారు. అయితే ఆ గ్లింప్స్ చివర్లో వచ్చిన ట్విస్ట్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. కాకా 2027 జనవరి 13న సంక్రాంతి బరిలో దిగుతున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చవచ్చు: డింపుల్ హయాతి పెళ్లి
ఆ హీరో సినిమాపై పోసాని వ్యాఖ్యలు వైరల్: చివరి 100 డేస్ అదేనంట!
[Kaaka, Chiranjeevi, Anaswara Rajan, Tollywood, Bobby]



