క మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్
on Nov 1, 2024
కిరణ్ అబ్బవరం(kiran abbavaram)హీరోగా సుజిత్, సందీప్(sujith,sandeep)ల దర్శకత్వంలో దివాలి కానుకగా అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'క'(ka) కొన్ని ఏరియాల్లో ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ షోస్ కూడా పడ్డాయి.మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చివరి ఇరవై నిముషాలు చాలా బాగుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని సాధించిందో చూద్దాం.
ప్రీమియర్స్ ద్వారా మొదటి రోజు ముప్పై ఐదు లక్షలు సాధించగా ఆ తర్వాత రోజు ఇండియా వైడ్ గా గా మూడుకోట్ల నలభై లక్షల రూపాయలని సాధించింది. అంటే టోటల్ గా తొలి రోజు మూడుకోట్ల డెబ్భై ఐదు లక్షల రూపాయలని సాధించింది. కిరణ్ అబ్బవరం సినీ కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ గా కూడా భావించవచ్చు.
ఇంతవరకు ఎవరు టచ్ చెయ్యని ఒక కొత్త పాయింట్ ని చెప్పిన 'క' మూవీ లో కిరణ్ అబ్బవరం సరసన నయన్ సారిక(nayan saarika)హీరోయిన్ గా చెయ్యగా తన్వి రామ్, శరణ్య ప్రదీప్, అచ్యుత్ కుమార్,బలగం జయరామ్, అజయ్, రెడీన్ కింగ్ స్లే తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు.శ్రీ చక్రాస్ ఎంటర్ టైన్మెంట్స్ ,క ప్రొడక్షన్స్ ల పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
