Home

»

Latest News

సర్జరీ తర్వాత ఎన్టీఆర్ ఫస్ట్ ఫోటో: హెల్త్ గురించి డాక్టర్ చెప్పిన అసలు నిజం ఇదే.!

Aug 13, 2026 1:23PM

ఎన్టీఆర్‌ భుజానికి గాయమవ్వగా, తాజాగా KIMS హాస్పిటల్‌లో సర్జరీ విజయవంతంగా పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ కి గాయమైన సమయంలో కానీ, సర్జరీ పూర్తయిన తర్వాత కానీ.. అసలు ఆయన ఎలా ఉన్నారో తెలిపే అధికారిక ఫోటోలు బయటకు రాలేదు. దీంతో అఫీషియల్ ఫోటో కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఎన్టీఆర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్న సందర్భంగా తీసిన లేటెస్ట్ ఫోటోను షేర్ చేసి, కిమ్స్ డాక్టర్ సర్ప్రైజ్ చేశారు.

ఎన్టీఆర్‌కి అర్త్రోస్కోపిక్ షోల్డర్ సర్జరీని డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని నిపుణులైన మెడికల్ టీమ్ పర్ఫెక్ట్‌గా పూర్తి చేసింది. సర్జరీ సక్సెస్ అవ్వడమే కాకుండా, ఎన్టీఆర్ ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉన్నారని తెలుపుతూ.. డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేశారు. 

ఆ ఫొటోలో ఎన్టీఆర్.. సర్జరీ తర్వాత మెడికల్ టీమ్‌తో కలిసి చిరునవ్వులు చిందిస్తూ, థంబ్స్ అప్ సైన్ చూపిస్తూ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఆయన భుజానికి వేసిన ఆర్మ్ స్లింగ్ సపోర్ట్ చూస్తేనే అర్థమవుతోంది.. ఆయన ఎంత వేగంగా కోలుకోవడానికి సిద్ధంగా ఉన్నారో.

డాక్టర్లు చెప్పిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ ప్రస్తుతం మెడికల్ సూపర్ విజన్ కింద ప్రాపర్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు. ఆయన పూర్తిగా కోలుకుని, మళ్లీ సాధారణ జీవితంలోకి, తన సినిమాల షూటింగ్‌లలో పాల్గొనడానికి సుమారు 2 నుండి 3 నెలల సమయం పడుతుందని డాక్టర్స్ స్పష్టం చేశారు.

 

 

Jr NTR, Shoulder Surgery, KIMS Hospital

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com