Home

»

Latest News

Jr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు తప్పిన ప్రమాదం!

Mar 08, 2026

బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) అభిమానులకు పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కిమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎన్టీఆర్ హాజరవ్వగా, ఆయనను చూడటానికి అభిమానులు భారీగా తరలివచ్చారు.

ఎన్టీఆర్ రాకతో హాస్పిటల్ ప్రాంగణం మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఒక్కసారిగా ఆయనను చూసేందుకు అభిమానులు ఎస్కలేటర్ వైపు గుమిగూడడంతో అక్కడి పరిస్థితి కొంత గందరగోళంగా మారింది. 

చిన్న తోపులాట జరగడంతో ఎస్కలేటర్ అద్దం పెరిగిపోయి, ఒకరిద్దరు అభిమానులు కింద పడిపోయారు. దీంతో మిగతా అభిమానులు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. 

అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. 

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com