
‘జిమ్ జిమ్ తార’ సాంగ్ ఇటీవల సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. జి.లక్ష్మిదేవి పాడిన ఈ పాట కొద్దిరోజులుగా అన్ని చోట్లా మారుమోగిపోతోంది.
నిజానికి ‘జిమ్ జిమ్ తార’ను ‘పర్ణశాల’ మూవీ కోసం జి.లక్ష్మిదేవి రాసి పాడటం విశేషం. అయితే అఫీషియల్ గా రిలీజ్ కాకముందే.. ఆమె పాడి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, అది ఓ రేంజ్ లో వైరల్ అయిపోవడం జరిగిపోయాయి. ఈ క్రమంలో అది తమ సినిమాలోని పాటే అని ప్రకటించి ‘పర్ణశాల’ మూవీ టీం సర్ప్రైజ్ చేసింది. ఇక ఇప్పుడు ఫుల్ సాంగ్ వచ్చింది.
ఒకే ఒక్క పాటతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్న హారర్ కామెడీ చిత్రం ‘పర్ణశాల’ నుంచి ‘జిమ్ జిమ్ తార’ పాట పూర్తి వెర్షన్‌ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా అధికారికంగా పూర్తి పాట విడుదల తర్వాత సినిమాపై మరింతా హైప్ పెరిగింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వై.జి. భరత్ మాట్లాడుతూ, “మా పర్ణశాల సినిమా కోసం జి.లక్ష్మిదేవి గారు రాసి పాడిన జిమ్ జిమ్ తార పాటకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఆనందాన్ని కలిగిస్తోంది. పూర్తి పాట విడుదల తర్వాత అనూహ్య స్పందన వస్తోంది.” అని తెలిపారు.
పూర్తి పాట అధికారికంగా విడుదల కాకముందే.. పలువురు నెటిజన్లు ఈ పాటకు రీల్స్, వీడియోలు రూపొందిస్తుండగా, సెలబ్రిటీలు సైతం తమ కంటెంట్‌లో ఉపయోగించడం విశేషం. ఇప్పుడు ఫుల్ సాంగ్ రిలీజ్ తర్వాత ఇంకా ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో చూడాలి
ఎస్‌ఎల్‌టీ ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత మంచి వెంకట్ నిర్మాణంలో వై.జి. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ కామెడీతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలను మేళవిస్తూ ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఇది కూడా చదవండి: ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2.. మనసులోని మాటలను ఓపెన్‌గా చెప్పిన సాయి పల్లవి.!
[Jim Jim Tara Full Song, Jim Jim Tara Lyrical Video, Jim Jim Tara Song, Parnashala Movie Song, Telugu Songs 2026, Telugu Film News]





