Home

»

Latest News

jetlee: జెట్లీ హైలెట్స్ ఇవేనంట... నిజమో కాదో తెలుసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుగా 

May 1, 2026 2:57PM

సెల్యులాయిడ్ వద్ద ఈ రోజు జరిగే సినీ సందడిలో నేను కూడా ఉన్నానంటూ 'జెట్లీ'(Jetlee)అడుగుపెట్టింది. మత్తు వదలరా ఫేమ్ రితీష్ రానా(Ritesh Rana)దర్శకుడు కావడంతో పాటు కామెడీ నటుడు సత్య హీరోగా మొదటి సారి చేయడంతో ప్రేక్షకుల చూపు జెట్లీ పై పడింది. పైగా ప్రచార చిత్రాలు బాగుండటంతో పాటు సత్యకి వెన్నెల కోశోర్  జత కట్టడంతో మూవీ లవర్స్  ఇక ఆగుతారా ఏంటి భారీగానే థియేటర్స్ కి పోటెత్తుతున్నారు. మరి మూవీ చూసిన ప్రేక్షకులు ఏ అంశాలు హైలెట్ గా ఉన్నాయని చెప్తున్నారో చూద్దాం

1 . హాలీవుడ్ మూవీ స్టైల్లో ఉన్నడైరెక్షన్ 
2 . ఫొటోగ్రఫీ 
3 . సత్య, వెన్నెల కిషోర్ తో పాటు ఆల్ ఆర్టిస్ట్స్ పెర్ ఫార్మెన్స్   
4 . పైలెట్ చెప్పే అనౌన్స్ మెంట్ ఎపిసోడ్ 
5 . ఫస్ట్ హాఫ్ లో సత్య నుంచి వచ్చిన 'గజినీ' టైపు కథనం
6 . సత్య, హీరోయిన్ క్యారక్టర్ చేసిన రియా సింఘా మధ్య వచ్చిన సీన్స్ 
7 . సందర్భానికి తగ్గట్టుగా సినిమాపేర్లని ఫజిల్ లో నింపే వెన్నెల కిషోర్ క్యారక్టర్ 
8 . ప్రీ క్లైమాక్స్ లో రివీల్ అయిన అన్ని క్యారెక్టర్స్ యొక్క లక్ష్యాలు
 

Also read: Jetlee Movie Review In Telugu: 'జెట్లీ' మూవీ రివ్యూ

ఇలా పైన చెప్పుకున్న హైలెట్స్ ని జెట్లీ ని చూసిన ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. రివ్యూస్ కూడా పర్వాలేదనే స్థాయిలోనే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ని కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి, హేమలత పెదమల్లు నిర్మించిన జెట్లీ కి కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందించాడు. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com