Home

»

Latest News

ప్రపంచ ప్రఖ్యాత రచయిత కన్నుమూత: షాక్ లో ఫ్యాన్స్! 

Oct 6, 2026 11:42AM


సోషల్ మీడియా దెబ్బకి ప్రపంచమే ప్రతి ఒక్కరికి కుగ్రామంలా కనిపించే పరిస్థితి. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రసిద్ధ బ్రిటిష్ నవలా రచయిత మరియు మాజీ రాజకీయ నాయకుడు అయిన జెఫ్రీ ఆర్చర్ చనిపోయిన విషయం వైరల్ గా మారింది.


 జెఫ్రీ ఆర్చర్ వయసు 86 కాగా నిన్న సోమవారం నాడు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో అంతర్జాతీయ సాహిత్య రంగంలో తీవ్ర విషాదం అలుముకుంది. అసాధారణ కథా కథన శైలితో పాఠకులను మంత్రముగ్ధులని చెయ్యడం ఆయనకీ వెన్నతో పెట్టిన విద్య. అందుకే  దశాబ్దాల పాటు తన రచనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులని  సంపాదించుకున్నారు.

ఇది కూడా చదవండి: 'దాదా' ఈజ్ బ్యాక్: గాయాన్ని సైతం లెక్కచేయని బాలయ్య డెడికేషన్!

 


జెఫ్రీ ఆర్చర్ రచించిన అనేక పుస్తకాలు సంచలన విజయాలని  సాధించాయి. ముఖ్యంగా  ‘కేన్ అండ్ ఏబెల్’ (Kane and Abel),  ‘క్లిఫ్టన్ క్రానికల్స్’ (Clifton Chronicles),  జైలు జీవితం నేపథ్యంలో రచించిన ‘ఎ ప్రిజన్ డైరీ’ (A Prison Diary)  సాహిత్య లోకంలో విశేష ప్రజాదరణ పొందాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయన రాసిన పుస్తకాలు ఏకంగా 30 కోట్లకు పైగా కాపీలు అమ్ముడయ్యాయంటే ఆయన సాహిత్య సంచలనం ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎంపిగా కూడా పని చేసారు. ఆయన మృతి పట్ల సాహితీ ప్రియులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నారు. త. ఆయన జీవితం, రాజకీయాలు మరియు సాహిత్య ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. 

 

[Jeffrey Archer Passed Away, jeffrey archer famous british novelist passed away, jeffrey archer novals, Hollywood, TeluguCinema News, Tollywood Cinema News, Tollywood, TeluguCinema]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com