Home

»

Latest News

ఒకేసారి 400 కుటుంబాలను దత్తత తీసుకున్న జయమ్మ.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

Oct 14, 2026 1:08PM

సినిమాల్లో తాము పోషించే పాత్రలు నిజ జీవితంపై కూడా ప్రభావం చూపిస్తాయని కొందరు నటీనటులు చెబుతుంటారు. తాజాగా ర‌ష్మిక దేవరకొండ కూడా ఇదే విషయాన్ని గుర్తుచేసుకుంటూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ మంచి పనిని అభిమానులతో పంచుకున్నారు. ‘జయమ్మ’ పాత్రకు, తన నిజ జీవితానికి కొన్ని పోలికలు ఉన్నాయని చెబుతూ.. తాను ఎప్పటినుంచో చేస్తున్న సేవా కార్యక్రమాన్ని ఇప్పుడు అందరికీ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

తాను ఒకేసారి 400 కుటుంబాలకు అండగా నిలిచినట్లు రష్మిక వెల్లడించారు. ఈ కుటుంబాలకు మూడు నెలల పాటు నిత్యావసర సరుకుల కోసం సాయం చేయనున్నట్లు తెలిపారు. ఇలా ప్రతి మూడు నెలలకు 400 కుటుంబాలకు చొప్పున సహాయం చేస్తూ, వచ్చే ఏడాది మొత్తం ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. నిత్యావసరాల కోసం ఖర్చు చేయాల్సిన డబ్బును ఆయా కుటుంబాలు పొదుపు చేసుకుని, తమ భవిష్యత్తు అవసరాల కోసం ఉపయోగించుకోవాలన్నదే తన ఉద్దేశమని వివరించారు.

ఇదిలా ఉంటే.. ఇంతకాలం తాను చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి బయటకు చెప్పలేదని ఆమె వెల్లడించారు. తనకు, తన టీమ్‌కు, కొద్దిమంది సన్నిహితులకు తెలిస్తే సరిపోతుందని భావించానని తెలిపారు. అయితే తాను చేస్తున్న పని గురించి తెలుసుకుని మరికొందరు కూడా తమకు తోచినంత సాయం చేయడానికి ముందుకొస్తే బాగుంటుందనే ఆలోచనతో ఇప్పుడు ఈ విషయాన్ని పంచుకుంటున్నట్లు చెప్పారు.

తన కెరీర్‌లో ఎదురైన కష్టాలు, నిద్రలేని రాత్రులు, గాయాలు, బాధలు, కన్నీళ్లకు ఈ కుటుంబాల ముఖాల్లో కనిపిస్తున్న చిరునవ్వులే విలువైన ప్రతిఫలమని ర‌ష్మిక‌ భావోద్వేగంగా పేర్కొన్నారు. అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు బదులుగా సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు.

 

 

[Jayamma Actress, Actress Helps 400 Families, 400 Families Adoption, Actress Charity Work, Celebrity Philanthropy, Actress Social Service, Grocery Support for Families, Telugu Cinema News, Actress Kindness, Celebrity Charity News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com