జయం రవి, లేడీ సింగర్ ఫోటోలు బయటకి..రవి భార్య ఆర్తి సంచలన పోస్ట్
on May 10, 2025
తమిళనాట మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో 'జయంరవి'(Jayam Ravi)కూడా ఒకడు. సినిమా సినిమాకి విభిన్నమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు అభిమానులతో పాటు ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి 'కాదలిక్క నెరమిల్లై' తో ప్రేక్షకుల ముందుకు రాగా నిత్య మీనన్ హీరోయిన్ గా చేసింది. కొన్ని నెలల క్రితం జయంరవి తన భార్య ఆర్తి(Aarti)నుంచి విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించాడు. ఈ విషయంలో ఆర్తి ఏం మాట్లాడలేదు. విడాకుల కేసులో కోర్ట్ నుంచి తీర్పు రావాల్సి ఉంది. ప్రముఖ లేడీ సింగర్ 'కెనిషా'తో జయంరవి రిలేషన్ లో ఉండటంవలనే ఆర్తి కి విడాకులు ఇచ్చాడనే కథనాలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని రవి చెప్పుకొచ్చాడు. కానీ రీసెంట్ గా జరిగిన ఒక ఫంక్షన్ కి రవి, కెనిషా(Kenisha)కలిసి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్తి ఒక నోట్ ని రిలీజ్ చేసింది.
ఆమె తన నోట్ లో 'నా కంటే నా కుమారుల ప్రశాంతతే ముఖ్యమని భావించి గత ఏడాదిగా నేను ఏం మాట్లాడకుండా ఎన్నో ఆరోపణలు భరించాను. అంత మాత్రాన నా వైపు నిజం లేదని కాదు. ఈ రోజు ప్రపంచమంతా ఫోటోలని చూసింది. విడాకుల ప్రాసెస్ కొనసాగుతుండగానే, పద్దెనిమిది సంవత్సరాల పాటు తోడుగా ఉన్న వ్యక్తి ఆ విధంగా చేసాడు. కొన్ని నెలలుగా ఆయన నుంచి ఆర్ధికంగా, నైతికంగా సపోర్ట్ లేదు. ఇప్పుడు ఇంటి విషయంలో బ్యాంకు సమస్య ఎదురయ్యింది. కానీ లెక్కల కంటే ప్రేమకే ఎక్కువ విలువ ఇచ్చాను.
పది, పద్నాలుగు వయసు ఉన్న పిల్లలకి భద్రత కావాలి. చట్టపరమైన అంశాలు పిల్లలకి తెలియకపోయినా, ఫోన్ కాల్ లిఫ్ట్ చెయ్యకపోవడం, మెసేజెస్ కి రిప్లై ఇవ్వకపోవడం, మీటింగ్స్ క్యాన్సిల్ చెయ్యడం, గాయల్లాంటివి వారికి తెలుసు. నేను ఈ రోజు ఒక భార్యగా, అన్యాయానికి గురైన మహిళగా మాట్లాడటం లేదు. పిల్లల శ్రేయస్సు కోరుకునే తల్లిగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే నా పిల్లలకి భవిష్యత్తు లేనట్టే. తండ్రి అంటే టైటిల్ మాత్రమే కాదు అదొక బాధ్యత. విడాకుల కేసులో తుది తీర్పు వెలువడే వరకు నా ఇనిస్టాగ్రామ్ ఐడి పేరు ఆర్తి రవి అనే ఉంటుంది. నేను ఏడవడం లేదు,అరవడం లేదు. ఇప్పటికే నాన్న అని నిన్ను పిలుస్తున్న పిల్లల కోసం నిలబడ్డానని నోట్ లో పేర్కొంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
