
-శ్రీనివాస మంగాపురం ఏం చెప్పబోతోంది
-ఘట్టమనేని మూడో తరం వారసుడు ఇండస్ట్రీని రూల్ చేస్తాడా!
-తండ్రి రమేష్ బాబు దాటి జయకృష్ణ టాప్ బెర్త్ ని పొందుతాడా!
-కృష్ణ, మహేష్ ఫ్యాన్స్ కోరిక ఏంటి
ఘట్టమనేని(Ghattamaneni).. ఈ పేరు వినపడటం ఆలస్యం.. అభిమానులు, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో కృష్ణ ,మహేష్ తాలూకు వైబ్రేషన్స్ స్టార్ట్ అవ్వడం మొదలవుతాయి. అంతలా సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్‌లో సృష్టించిన ప్రభంజనం, ఆయన వారసుడిగా వచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు(Mahesh Babu)సృష్టిస్తున్న ప్రభంజనాలు గుర్తుకొస్తుంటాయి. అయితే కృష్ణ(Krishna)గారి పెద్ద కుమారుడు, మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు(Ramesh Babu)హీరోగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. దురదృష్టవశాత్తూ ఆయన ఇప్పుడు మధ్య లేరు. కానీ ఆయన సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని 'శ్రీనివాస మంగాపురం(Srinivasa Mangapuram)అనే చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు
ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాలు చూస్తుంటే డాన్స్,లవ్, రొమాన్స్, యాక్షన్ సీక్వెన్స్ లో జయకృష్ణ ఒక రేంజ్ లో మెస్మరైజ్ చేయబోతున్నట్టుగానే ఉంది. దీంతో ఘట్టమనేని ఫ్యామిలీ నుండి వస్తున్న ఈ మూడో తరం వారసుడిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక ఇప్పుడు అభిమానుల్లో మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న.. "జయకృష్ణ తన తండ్రి రమేష్ బాబు పేరుని నిలబెడతాడా?" అని. ఎందుకంటే కృష్ణ మొదటి వారసుడిగా రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాలు చేసాడు. కానీ లాంగ్ రన్ పరంగా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో ఇప్పుడు అభిమానులు జయకృష్ణ ఇండస్ట్రీలో పూర్తి స్థాయిలో నిలదొక్కుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంలో బాబాయ్ మహేష్ సపోర్ట్ జయకృష్ణకి వంద శాతం ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో బాబాయ్ మార్గదర్శకత్వంలో, తండ్రి సాధించలేని దానిని జయకృష్ణ టాలీవుడ్‌లో సాధిస్తాడని ఘట్టమనేని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.
Also read: Peddi: పెద్దికి బిగ్ షాక్: హైకోర్టులో పిటిషన్ వేసి మళ్ళీ వెనక్కి తీసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ
శ్రీనివాస మంగాపురం విషయానికి వస్తే ఆర్ ఎక్స్ 100 ఫెమ్ అజయ్ భూపతి దర్శకుడు కాగా రషా తడాని హీరోయిన్. ఈమె ఎవరో కాదు ఒకప్పటి అగ్ర హీరోయిన్ రవీనా టాండన్ కూతురు. అశ్వని దత్, జెమినీ కిరణ్ నిర్మాతలు. రిలీజ్ డేట్ త్వరలోనే రానుంది.







