Home

»

Latest News

Janhvi Kapoor: మానవ నా చెయ్యి పట్టుకో.. పెద్ది ప్రీ రిలీజ్ లో జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు 

Jun 1, 2026 10:03PM

 

పెద్ది(Peddi)ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డున ఉన్న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. తమ కళ్ళ ముందు చరణ్ తో పాటు జాన్వీకపూర్, ఏ ఆర్ రెహ్మాన్ ఉండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. సినీ ప్రముఖల స్పీచ్ కూడా అభిమానులని, సినీ ప్రియులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ క్రమంలో జాన్వీ కపూర్ మాట్లాడుతు పెద్ది మూవీ మనకి ఎన్నో నేర్పుతుంది. మన లక్ష్యం ఏంటో కూడా చెప్తుంది. నా పని మిమ్మల్ని ఎంటర్ టైన్ మెంట్ చేయడం. మీ అందర్నీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. పెద్ది మీ అందరికి నచ్చుతుందని చెప్పిన జాన్వీ ఆ తర్వాత తన తల్లి శ్రీదేవి, చిరంజీవి కాంబోలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలో చిరంజీవిని ఉద్దేశించి శ్రీదేవి మాట్లాడిన మానవ నా చెయ్యి పట్టుకోవా అనే డైలాగ్ ని చెప్పి అభిమానులని అలరించింది. పెద్దిలో అచ్చాయమ్మా గా జాన్వీ తన విశ్వరూపాన్ని మరో సారి ప్రదర్శించనుంది.

Also read: Peddi: పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జరగడానికి సూత్రధారి ఇతనే 

 
 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com