Home

»

Latest News

జాన్వీకపూర్ ఆ హీరోని రహస్యంగా పెళ్లి చేసుకుందా.. ఈ వీడియోనే అందుకు సాక్ష్యమా!

Aug 27, 2026 12:56PM

 


'పెద్ది'తో మెస్మరైజ్ చేసిన దేవర భామ జాన్వీ కపూర్ తదుపరి చిత్రం అప్డేట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ యువ హీరో ఇషాన్ ఖట్టర్ తో పెళ్లిపీటలు ఎక్కిందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ హోదాలో చక్కర్లు కొడుతుంది.


ఒకవైపు పెళ్లికూతురి గెటప్‌లో ఐవరీ, ఎరుపు రంగుల శోభితమైన లెహంగా ధరించి మెరిసిపోతున్న జాన్వీ,మరొక వైపు  తెల్లటి షేర్వాణీ ధరించిన ఇషాన్ ఖట్టర్ కలిసి నడుస్తున్న దృశ్యాలు చూసి ప్రతి ఒక్కరూ వీళ్లు నిజంగానే సీక్రెట్‌గా పెళ్లి లేదా నిశ్చితార్థం చేసుకున్నారేమో అని కన్ఫ్యూజ్ అయ్యారు.  ఈ వైరల్ వీడియోలో జాన్వీ కపూర్ హెవీ జ్యువెలరీతో సాంప్రదాయబద్ధంగా చాలా అందంగా కనిపించడమే కాకుండా, వీరిద్దరి మధ్య ఉన్న ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. వీడియోలో "సరైన వ్యక్తి ఎవరో మనకు ఎలా తెలుస్తుంది?. నీకోసం ఓపికగా ఎవరు ఎదురుచూస్తుంటే వాళ్లే సరైన వ్యక్తి' అని జాన్వీ అడిగిన ప్రశ్నకి  ఇషాన్ ఖట్టర్ "ఆమె కోసం ఎదురుచూడటంలో కూడా సంతోషం ఉంటే ఆమెనే మన భాగస్వామి" అంటూ చెప్పే రొమాంటిక్ డైలాగ్స్ నెటిజన్ల మనసులను దోచుకున్నాయి. 


Also Read: లవకుశతో ఇరుముడిని పోలుస్తున్న ప్రేక్షకులు.. అందుకు కారణాలు ఇవే


ఈ సన్నివేశాలు చూసిన చాలామంది అభిమానులు 2018 లో విడుదలైన వీరి తొలి చిత్రం 'ధడక్' రోజులను గుర్తుచేసుకున్నారు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో వచ్చిన 'ధడక్' సినిమాతోనే వీరిద్దరూ హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆ సినిమాలో విషాదంతో కూడిన ముగింపు ఉండటంతో, "ధడక్ చిత్రానికి దక్కాల్సిన అసలైన హ్యాపీ ఎండింగ్ ఇదే" అంటూ కామెంట్ల వర్షం కురిపించారు.  అయితే, ఈ వైరల్ పెళ్లి వార్తల వెనుక ఉన్న అసలు నిజమేంటంటే.. వీళ్లిద్దరూ నిజంగా పెళ్లి చేసుకోలేదు! దాదాపు 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జాన్వీ, ఇషాన్‌లు కలిసి ఒక ప్రముఖ జ్యువెలరీ, వెడ్డింగ్ బ్రాండ్ ప్రమోషన్ కోసం చేసిన కమర్షియల్ యాడ్ షూట్ ఇది. ప్రేమ, నిబద్ధత, భాగస్వామి కోసం ఎదురుచూడటం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ బ్రాండ్ ప్రమోషనల్ క్యాంపైన్‌లో భాగంగానే వీరిద్దరూ నూతన వధూవరులుగా దర్శనమిచ్చారు.  ఇషాన్ ఖట్టర్ స్వయంగా ఈ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ "కొన్ని కలయికలు అసలు కాలమే మారనట్టు అనిపిస్తాయి" అని క్యాప్షన్ జోడించడంతో ఈ కాంబినేషన్‌కి  మళ్లీ భారీ స్పందన లభిస్తుంది. 

Janhvi Kapoor, Ishaan Khatter, Tollywood, TeluguCinema, TeluguNews, TeluguCinemaNews TeluguOneDotCom

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com