
ఇళయ దళపతి విజయ్(VIjay)నిన్న వరల్డ్ సెల్యులాయిడ్ పై జననాయగన్(జన నాయకుడు) తో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.తన చివరి మూవీ అని విజయ్ ప్రకటించిన నేపథ్యంలో ఆనందాన్ని నింపుకున్న భావోద్వేగంతో అభిమానులు తమ హీరో సినిమా చూసిన సందర్భం బహుశా వరల్డ్ హిస్టరీలో జన నాయగన్ అయ్యుండొచ్చు. ప్రెజెంట్ థియేటర్స్ లో జననాయగన్ నెగిటివ్ టాక్ తో తన జర్నీని కొనసాగిస్తోంది.
మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 78.27 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగా రెండవ రోజు వరల్డ్ వైడ్ గా 34 కోట్లు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో రెండు రోజులకి 112 కోట్ల గ్రాస్ వరకు సాధించినట్టయ్యింది. దీంతో రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరి కొత్త రికార్డు నమోదు చేసింది. కానీ సెకండ్ డే కి సగానికి సగం కలెక్షన్స్ పడిపోవడంతో ఈ వీకెండ్ లో ఎంత మేర కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.
Also read: ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ సిగరెట్ తో కాల్చిన ఫ్యాన్స్.. ప్రముఖ నటి ఆవేదన
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ 'భగవంత్ కేసరి' కి జన నాయకుడు రీమేక్ గా తెరక్కిందనే విషయం అర్ధమవుతున్నా,విజయ్ క్రేజ్, మేకింగ్ శైలి కారణంగా తెలుగు వర్షన్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. మొదటి రోజు తెలుగు వెర్షన్ ద్వారా దాదాపు 80 లక్షల నెట్ కలెక్షన్లు రాగా, రెండవ రోజు శుక్రవారం నాడు 1,317 షోలు మరియు 24 శాతం థియేటర్ ఆక్యుపెన్సీతో 1.35 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. రెండు రోజుల్లో కలిపి తెలుగు వెర్షన్ ద్వారా మొత్తం నెట్ వసూళ్లు 2.15 కోట్లకి చేరుకున్నాయి.
Jana Nayagan, VIjayThalapathy, Jana Nayakudu






