Home

»

Latest News

వాళ్ళకి మాత్రం షాక్: ఓటీటీలోకి జననాయకుడు.. డేట్ ఇదే

Aug 18, 2026 12:42PM

 

ఇళయ దళపతి విజయ్ గత నెల 23 న జన నాయగన్( జన నాయకుడు) తో ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. అనూహ్యంగా ఆ ఏరియా,ఈ ఏరియా అని లేకుండా అన్ని ఏరియాస్ లో డిజాస్టర్ గా నిలిచింది. బ్రేక్ ఎవెన్యూ కూడా దక్కించుకోలేదంటే విజయ్ ప్రస్తుతం ఉన్న పొజిషన్ దృష్ట్యా సినిమా అనేది ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు. 


జన నాయగన్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ  ZEE5  స్ట్రీమింగ్ హక్కులని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆగస్టు 21వ తేదీ నుండి తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దియేటర్లలో ఈ సినిమాని మిస్ అయినవారు, లేదా విజయ్ వెండితెర వీడ్కోలు ప్రయాణాన్ని మళ్లీ ఇంట్లోనే అనుభూతి చెందాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.  ‘జన నాయగన్’ ని  కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మించారు. హెచ్. వినోత్ దర్శకుడు కాగా  అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు.


Also read: డైరెక్టర్ల ప్రసంగాలు: సినిమాకి ప్లస్సా, మైనస్సా!

 విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించగా, మమితా బైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి వంటి దిగ్గజ తారలు కీలక పాత్రలు పోషించారు. సుమారు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. 

Jana Nayagan, Vijay, Pooja Hegde
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com