Home

»

Latest News

జైలర్ 2 టికెట్స్ రగడ: తెలుగు రాష్ట్రాల్లో కోలాహలం 

Oct 10, 2026 6:50PM


టైగర్ ముత్తువేల్ పాండియన్ 'హుకుం' అంటూ జైలర్ 2 తో ల్యాండ్ కావడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఆ కట్ అవుట్ కి తెలుగు నాట ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. రెండు దశాబ్దాల క్రితమే గుంటూరు లాంటి ఏరియాలో టికెట్స్ కోసం పోలీసులతో గొడవ పెట్టుకున్న ఫ్యాన్స్ సైతం ఉన్నారు. మరి 'జైలర్ 2 ' పై ఎలాంటి క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు.


 అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జైలర్ 2 కి ఉన్న భారీ క్రేజ్,మార్కెట్ అంచనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ జారీ చేసింది. దీని ప్రకారం సినిమా విడుదలైన మొదటి వారం రోజుల పాటు, అనగా అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో ప్రత్యేక ధరలు వర్తించనున్నాయి.   ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రతి టికెట్‌పై 50 రూపాయల వరకు, అలాగే మల్టీప్లెక్సులలో  75 వరకు అదనంగా పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఈ పెంచిన ధరలతో పాటు జీఎస్టీ (GST) కూడా వర్తించనుంది. అంతేకాకుండా, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించేందుకు వీలుగా అక్టోబర్ 21 వరకు ప్రతి రోజు అదనంగా ఒక షోతో కలిపి మొత్తం 5 షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. ఏపీలో దొరికిన ఈ ఊరటతో మేకర్స్ ఖుషీ అవుతున్నారు. 


ఇది కూడా చదవండి: నెట్టింట చిరంజీవి పదో తరగతి సర్టిఫికేట్: పూర్తి వివరాలు తెలిస్తే షాక్ అవుతారు!

 

  అయితే సోషల్ మీడియా వేదికగా  కొంత మంది మాత్రం డబ్బింగ్ మూవీకి రేట్స్ పెంచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అభిమానులు, సినీ ప్రేమికులు మాత్రం టీ తాగాలంటేనే ఇరవై రూపాయలకి రావడం లేదు, అలాంటిది భారీ బడ్జెట్ మూవీ. పైగా సినిమా సినిమానే. రేట్స్ నార్మల్ గానే పెంచారని అంటున్నారు. తెలంగాణలో మాత్రం మాములు రేట్స్ కే రిలీజ్ అవుతుంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com