Home

»

Latest News

జైలర్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది: ఆ డేట్ కి ఉన్న స్పెషల్ ఇదే 

Sep 3, 2026 1:11PM

 

 

సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మూవీ  జైలర్. దీంతో  సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'జైలర్ 2 ' పై ఎలాంటి అంచనాలు ఉంటాయో చెప్పక్కర్లేదు. ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు అయితే రిలీజ్ డేట్ కోసం ఎదురుచూపులు. ఇప్పుడు ఆ ఎదురుచూపులు ఫలించి రిలీజ్ డేట్ వచ్చేయడంతో వాళ్లంతా రజిని స్టైల్ ఆఫ్ మేనరిజమ్స్ తో బిజీగా ఉన్నారు. చేతిలో తుపాకీ పట్టుకుని ఉన్న రజినీకాంత్ పవర్‌ఫుల్ పోస్టర్‌ని విడుదల చేస్తూ, దసరా కానుకగా  ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 15, 2026న థియేటర్లలోకి వస్తుందని స్పష్టంగా ప్రకటించింది. "అలప్పార కేలప్పరోమ్" అనే 'హుకుమ్' పాటలోని ఐకానిక్ క్యాచీ ట్యాగ్‌లైన్‌తో ఈ కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్‌గా మారింది.

టైగర్ ముత్తువేల్ పాండ్యన్ పాత్రలో రజినీకాంత్ ఇచ్చే ఎలివేషన్లు, ఆయన మానరిజమ్స్ ప్రేక్షకులను ఎలా కట్టిపడేస్తాయో మొదటి భాగంలో అందరూ చూశారు. ఇప్పుడు సీక్వెల్‌లో ఆ క్రేజ్‌ను మరింత తారాస్థాయికి తీసుకెళ్లేందుకు దర్శకుడు నెల్సన్ అత్యంత ప్రతిష్టాత్మక కథనాన్ని సిద్ధం చేశారు. ఈసారి కేవలం రజినీకాంత్ విశ్వరూపం మాత్రమే కాకుండా, భారీ తారాగణం ఈ చిత్రంలో అలరించబోతోంది. విద్యాబాలన్, ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తి, రమ్యకృష్ణ మరియు యోగి బాబు వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్ సేతుపతి ఒక ప్రత్యేక కామియో పాత్రలో మెరవనుండగా, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ మరియు హృతిక్ రోషన్ల మెరుపు నటన కూడా ఈ సీక్వెల్ స్థాయిని మరింత పెంచుతుందని టాక్ నడుస్తోంది.

Also Read: రోమాంచకం మూవీపై మహేష్ బాబు షాకింగ్ రివ్యూ 

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ బాణీలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదలైన 'అలా బొలేలో' ప్రమోషనల్ సాంగ్ మరియు అనౌన్స్‌మెంట్ టీజర్ సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచాయి. 

 

[ RajiniKanth, jailer 2, Nelson DilpKumar, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywoodnews]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com