
సూపర్‌స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘జైలర్ 2’ రిలీజ్‌కు మరింత దగ్గరైంది. నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సినిమా రన్‌టైమ్ కూడా బయటకు వచ్చింది.
సెన్సార్ బోర్డు నుంచి U/A 16+ సర్టిఫికెట్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక సినిమా నిడివి విషయానికి వస్తే.. ఏకంగా 165 నిమిషాలు ఉన్నట్టు సర్టిఫికేషన్ వివరాల్లో నమోదైంది. అంటే దాదాపు 2 గంటల 45 నిమిషాలు అన్నమాట.
ఇది పెద్దగా ఆశ్చర్యపరిచే రన్‌టైమ్ అయితే కాదు. 2023లో వచ్చిన ‘జైలర్’ కూడా దాదాపు 2 గంటల 48 నిమిషాల నిడివితో వచ్చింది. అంటే సీక్వెల్ రన్‌టైమ్ తొలి భాగం కంటే సుమారు మూడు నిమిషాలు తక్కువగా ఉంది.

ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్ గా రజినీకాంత్ మాస్ అవతార్‌లో కనిపించనున్నారు. ఈసారి కథ మరింత పెద్ద స్థాయిలో ఉండబోతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ వంటి క్యామియోలు మరోసారి హైలైట్‌గా నిలవగా.. ఎస్.జే. సూర్య, విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరమూడు తదితరులు కొత్తగా జాయిన్ అయ్యారు. దీంతో ‘జైలర్ 2’లో స్టార్ కాస్ట్ కూడా భారీగానే ఉంది.
ఈ సినిమా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. సెన్సార్ కూడా పూర్తవడంతో ‘జైలర్ 2’ ఇక రిలీజ్‌కు పూర్తిగా సిద్ధమైనట్టే. మరి నెల్సన్ ఈసారి టైగర్ ముత్తువేల్ పాండియన్‌తో ఎలాంటి మాస్ ట్రీట్ ఇస్తాడో చూడాలి.
ఇది కూడా చదవండి: బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల కాదు.. ఊహించని దర్శకుడితో చిరంజీవి మూవీ.!
[Jailer 2 Censor Report, Jailer 2 Movie, Super Star Rajinikanth, Nelson Dilipkumar, Anirudh Ravichander, Mohanlal, Shiva Rajkumar, Vidya Balan, Telugu Film News]




