Home

»

Latest News

‘వియ్ ఆర్ నాట్ క‌పుల్‌’.. త‌న బ‌ర్త్‌డే వేడుక‌లో త‌లైవాపై కామెంట్ చేసిన విద్యాబాల‌న్.!

Oct 24, 2026 7:13PM

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో, ఈ సినిమాకు సంబంధించిన ఓ బిహైండ్ ద సీన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో రజనీకాంత్, బాలీవుడ్ నటి విద్యాబాలన్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌తో పాటు పలువురు నటీనటులు కనిపించారు. ముఖ్యంగా విద్యాబాలన్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.

జ‌న‌వ‌రి 1న విద్యాబాల‌న్ పుట్టిన‌రోజు. జైల‌ర్‌2 సెట్స్‌లో ఆమె పుట్టిన‌రోజు వేడుక‌ను నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలో బిందాస్ సాంగ్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. విద్యాబాల‌న్ కేక్ క‌ట్ చేసిన అనంత‌రం రజనీకాంత్‌కు కేక్ తినిపించగా, ఆయన కూడా ఆమెకు కేక్ తినిపించారు. ఆ సమయంలో విద్యాబాలన్ సరదాగా ‘మేము కపుల్ కాదు’ అంటూ నవ్వడం వీడియోలో కనిపించింది. సినిమాలో కాంత పాత్రలో కనిపించిన విద్యాబాలన్‌తో టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజనీకాంత్ చేసే సరదా సన్నివేశాలను గుర్తుచేసుకుంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాంత పుట్టినరోజును టైగర్ సెలబ్రేట్ చేస్తున్నాడంటూ సరదాగా పోస్టులు పెడుతున్నారు.

ఈ వీడియోలో మరో ఆసక్తికరమైన విషయం కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ప్రముఖ హాస్యనటుడు సంతానం ఈ వేడుక‌లో కనిపించడంతో ‘జైలర్ 2’లో ఆయన కూడా నటించారనే చర్చ మళ్లీ మొదలైంది. సంతానం ఈ సినిమా కోసం సుమారు పది రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నప్పటికీ, ఆయనకు సంబంధించిన సన్నివేశాలను తుది ఎడిటింగ్‌లో తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన నటించిన సన్నివేశాలను డిలీటెడ్ సీన్స్ రూపంలో విడుదల చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాలో చోటు దక్కని కొన్ని సన్నివేశాలు ఓటీటీ అన్‌కట్ వెర్షన్‌లో వస్తాయనే ఆశాభావాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అయితే సంతానం సన్నివేశాలతో పాటు అదనపు ఫుటేజ్‌ను ఓటీటీలో విడుదల చేస్తారనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

 

 

[Jailer 2 BTS Video, Rajinikanth, Vidya Balan, Nelson Dilipkumar, Santhanam Deleted Scenes, Jailer 2 Viral Video, Kantha Birthday, Tamil Cinema News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com