జాక్ ఫస్ట్ డే కలెక్షన్స్ కి,సెకండ్ డే కలెక్షన్స్ కి తేడా వచ్చింది..ఫిగర్స్ ఇవేనా!
on Apr 12, 2025

సిద్దు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda)బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaianya)హీరో హీరోయిన్లు గా బొమ్మరిల్లు భాస్కర్(BOmmarillu bhaskar)దర్శకత్వంలో ఏప్రిల్ 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ జాక్(Jack)ప్రకాష్ రాజ్,నరేష్,బ్రహ్మాజీ,రవి ప్రకాష్ కీలక పాత్రలు పోషించగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రపై భోగవల్లిప్రసాద్(Bvsn Prasad)బాపినీడు నిర్మాతలుగా వ్యవహరించారు.
ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 2200 స్క్రీన్‌లలో రిలీజ్ అయ్యింది. మార్నింగ్ షో నుంచే ప్రేక్షకుల చేత డివైడ్ టాక్ ని తెచ్చుకొని తొలి రోజు 2.5 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సాధించింది.ఇక రెండో రోజు కేవలం 83 లక్షల నెట్ కలెక్షన్స్ ని మాత్రమే వసూలు చేసి టోటల్ గా రెండు రోజుల్లో కేవలం 3 కోట్ల లోపు కలెక్షన్స్ ని మాత్రమే రాబట్టింది.టిల్లు స్క్వేర్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వచ్చిన సిద్దు సినిమాకి ఇంత తక్కువ స్థాయిలో కలెక్షన్స్ రావడం పట్ల సినీ ట్రేడ్ వర్గాల వారు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
స్పై యాక్షన్ కామెడీ ఫిలింగా తెరకెక్కిన జాక్ 40 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ మూవీ బ్రేక్ ఎవెన్యూ అవ్వడం కష్టమనే మాటలు వినపడుతున్నాయి.కాకపోతే ఓటీటీ రైట్స్,శాటిలైట్ రైట్స్ కొంచం ఊరట.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



