
అనీష్, అనస్వర రాజన్ జంటగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా ‘ఇట్లు అర్జున’. ఈ సినిమాతో మహేష్ ఉప్పాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవంబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు మంచి ఆసక్తిని క్రియేట్ చేయగా.. తాజాగా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ ట్రైలర్ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల కావడం విశేషం.
ఈ సినిమాకు కింగ్ నాగార్జున ప్రజెంటర్‌గా వ్యవహరిస్తుండగా, ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారి నిర్మిస్తున్నారు. కొత్త నటుడు అనీష్‌ను పరిచయం చేస్తూ రూపొందించిన ఈ సినిమా.. ప్రేమకథతో పాటు యాక్షన్, ఎమోషన్స్‌ను కూడా మిక్స్ చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
అర్జున్ ఒక మూగ యువకుడు. కీర్తిని ఎంతగానో ప్రేమిస్తుంటాడు. అయితే తన మనసులోని భావాలను మాటల్లో చెప్పలేని పరిస్థితి. అలాంటి వ్యక్తి జీవితంలోకి ప్రేమతో పాటు అనుకోని ప్రమాదాలు కూడా వస్తే ఎలా ఉంటుంది? ఈ పాయింట్ చుట్టూనే సినిమా కథను నడిపించినట్లు తెలుస్తోంది.
ట్రైలర్‌కు సంబంధించి ఆసక్తి కలిగిస్తున్న మరో అంశం యాక్షన్ ఎపిసోడ్స్. ఈ సినిమాలో కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాకుండా థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా ఉంటాయని ట్రైలర్ సూచిస్తోంది. అయితే ఈ యాక్షన్ వెనుక ఉన్న అసలు కారణం ఏంటనేది తెరపైనే చూడాలి.
అనీష్ తొలి చిత్రంతోనే మాటలు రాని యువకుడి పాత్రను ఎంచుకోవడం సాహసమే. అనస్వర రాజన్ కూడా తన పాత్రతో ఆకట్టుకునేలా కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఇప్పటికే పాటలు, టీజర్ ద్వారా కొంత ఆసక్తిని పెంచింది. ఇక తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు మరో ఆకర్షణగా నిలవనుంది.
ఓవరాల్‌గా చూస్తే.. మూగ యువకుడి ప్రేమకథ, యాక్షన్, ఎమోషన్స్ కలిపి ‘ఇట్లు అర్జున’ను ఓ డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌గా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.
ఇది కూడా చదవండి: ‘జైలర్ 2’ తర్వాత మరో క్రేజీ మూవీ.. ‘ఓం’ తెలుగు హక్కులు సితార చేతికి.!
[Itllu Arjuna Trailer, Jr NTR, Aniesh, Anaswara Rajan, Nagarjuna, Mahesh Uppala, Venky Kudumula, Thaman S, Telugu Film News]






