హార్దిక్ పాండ్యా అంటే పిచ్చి ప్రేమ..బ్యాటింగ్ బాగుంటుంది
on Aug 30, 2024
2011 లో వచ్చిన ప్యార్ కా పంచ్ నామ అనే మూవీతో హిందీ చిత్ర రంగ ప్రవేశం చేసిన భామ ఇషితా రాజ్(ishita raj)ఇప్పటి వరకు తొమ్మిది సినిమాల దాకా చేసిన ఇషితా సోను కే టిటు కి స్వీటీ తో భారీ హిట్ ని అందుకుంది. ఇటీవల వచ్చిన వైల్డ్ వైల్డ్ పంజాబ్ లోను ప్రాముఖ్యత ఉన్న పాత్రలో మెరిసింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ప్రముఖ స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా(harudik pandya) మీద ఉన్న తన ప్రేమని బయటపెట్టింది.
ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఇషితా మాట్లాడుతూ హార్దిక్ పాండ్యా అంటే చాలా ఇష్టం.మంచి క్రికెట్ ప్లేయరే కాకుండా అధ్బుతమైన ఆల్ రౌండర్. హార్దిక్ బ్యాటింగ్ చేస్తుంటే చాలా బాగుంటుంది. అందుకే అతనంటే పిచ్చి. నేను అతన్ని ప్రేమిస్తున్నాను. నాకున్న అభిమాన క్రికెటర్స్ లో హార్దిక్ ఒకడని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. అదే విధంగా ఇద్దరి మధ్య ఏమైనా ప్రేమ ఉందేమోనని ఆరా తీస్తున్నారు.
ఇందుకు కారణం కూడా లేకపోలేదు. హార్దిక్ 2020 లో ప్రముఖ నటి నటాసా స్టాంకో వించ్(natasa stankovic)ని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరకీ ఒక బాబు కూడా ఉన్నాడు. కాని గత నెల జులై లో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. అప్పట్నుంచి ప్రముఖ నటి అనన్య పాండే తో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ప్రముఖ గాయని జాస్మిన్ వాలియా తో కూడా డేటింగ్ లో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ టైం లో ఇషితా మాటలు పలు అనుమానులకి దారి తీస్తున్నాయి.
Also Read