Home

»

Latest News

Lenin: లెనిన్ మూవీతో భాగ్యశ్రీ బోర్సే తొలి మైల్‌స్టోన్ హిట్ అందుకోబోతుందా!

Jul 6, 2026 11:56AM

 

కళ్ళతోనే తన క్యారక్టర్ తాలూకు ఐడెంటిటీని ప్రేక్షకుల్లోకి చొచ్చుకొని పోయేలా చేయగల నటి భాగ్యశ్రీ బోర్సే. రవితేజతో చేసిన తొలి చిత్రం 'మిస్టర్ బచ్చన్' ప్లాప్ అయినా ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ సంపాదించింది. ఆ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన కాంత, 'ఆంధ్రా కింగ్ తాలూకా' కింగ్ డమ్ ల పరిస్థితి కూడా అంతే. ఇలాంటి తరుణంలో  రేపు 10  న విడుదల కాబోతున్న 'లెనిన్' మూవీపైనే ఈ ముద్దుగుమ్మ తన ఆశలన్నీ పెట్టుకుంది. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ రూరల్ యాక్షన్ డ్రామాలో భాగ్యశ్రీ బోర్సే 'భారతి' అనే కీలకమైన రోల్ లో  కనిపించబోతోంది.

మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రాయలసీమ రగ్గడ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ కథలో మహాభారత ఛాయలు, ఫ్రెండ్‌షిప్, లవ్, రివోల్ట్ మరియు వార్ వంటి ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నట్లు ట్రైలర్ కట్‌ను బట్టి స్పష్టమవుతోంది. "ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం మరొకటి లేదు" అనే పవర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. అఖిల్ అక్కినేని మాస్ అవతార్‌తో పాటు ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే పాత్ర కూడా కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా కథను మలుపు తిప్పే బలమైన ఎమోషనల్ కోర్‌తో సాగుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం అక్కినేని నాగార్జున, నిర్మాత నాగవంశీలతో పాటు చిత్ర బృందం మొత్తం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాగార్జున మాట్లాడుతూ.. స్క్రీన్ మీద అఖిల్ కనిపించడు, కేవలం 'లెనిన్' మాత్రమే కనిపిస్తాడని, రాయలసీమ నేపథ్యంలో సాగే ఒక మహాభారతం ఇదని కాన్ఫిడెంట్‌గా చెప్పారు.

Also read: Rao bahadur: కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న రావు బహదూర్.. మూడురోజులకి ఎంతంటే!

థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, "సోల్ ఆఫ్ లెనిన్", "జయ మంగళం" వంటి పాటలు ఇప్పటికే మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు భాగ్యశ్రీ బోర్సే నటనకు, అందానికి మంచి మార్కులే పడుతున్నప్పటికీ బాక్సాఫీస్ సక్సెస్ అనేది ఆమెకు కెరీర్ పరంగా అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటిల క్రేజీ ప్రాజెక్ట్ 'కాంత'తో పాటు తమిళంలో 'సేయోన్' వంటి సినిమాలు ఉన్నాయి. అయినప్పటికీ, తెలుగులో పూర్తి స్థాయి కమర్షియల్ బ్లాక్‌బస్టర్ హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలంటే 'లెనిన్' విజయం ఆమెకు ఎంతైనా అవసరం. మరి లెనిన్  భాగ్యశ్రీ  కెరీర్‌లో ఫస్ట్ మైల్‌స్టోన్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com