Home

»

Latest News

దయచేసి అర్ధం చేసుకోండి.. ఫ్యాన్స్ విన్నపం

Aug 18, 2026 11:26AM

 

ఈ మధ్య కాలంలో అంటే దగ్గర దగ్గరగా ఒక దశాబ్దం అనుకోండి, ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే పాజిటివ్ వైబ్రేషన్ తెచ్చుకున్న మూవీ ఏదైనా ఉంది అంటే 'ఇరుముడి' అని చెప్పవచ్చు.  పైన చెప్పుకునే ఆ మాట పాతది అయిపోయిందంటే సదరు వర్డ్ ఎంతగా అభిమానుల్లో, ప్రేక్షకులో నానుతూ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నెల 21 న రిలీజ్ కి సిద్దమవుతుండటంతో వాళ్ళందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తూ ఉన్నారు. కొంత మంది అయ్యప్ప స్వామి భక్తులైతే ఇరుముడికి చెప్పులు లేకుండా వెళ్తామనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్లంతా ఇరుముడి విషయంలో టెన్షన్ గా ఉన్నారు.


 ఇటీవల హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేసింది. సాధారణంగా ఏ సినిమా ప్రమోషన్స్ అయినా పాజిటివ్ వైబ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్‌తో సాగిపోతుంటాయి, కానీ ఈ వేడుక మాత్రం సరికొత్త రచ్చకు దారితీసింది. రవితేజ, అజయ్ ఘోష్ చేసిన బూతు   సంభాషణలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కాగానే నెటిజన్లు, ముఖ్యంగా రవితేజ అభిమానులు, అయ్యప్ప స్వామి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'ఇరుముడి' అనే పేరుకి అయ్యప్ప స్వామి భక్తుల దృష్టిలో ఎంతో పవిత్రమైన అర్థం ఉంది. సినిమాలో హీరో అయ్యప్ప స్వామి మాల ధరించి, ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు. ఇటువంటి పవిత్రమైన సినిమా వేడుకలో, పబ్లిక్ స్టేజ్ మీద వేలాది మంది ప్రేక్షకులు మరియు కుటుంబాలు చూస్తుండగా అలాంటి అసభ్య పదాలను వాడడం సమంజసం కాదని ఫైర్ అవుతున్నారు.  ఈ రకమైన అనుచిత సంభాషణలు భవిష్యత్తు ఈవెంట్లలో పునరావృతం కాకూడదని, సినిమా వేదికలపై నటీనటులు క్రమశిక్షణతో మాట్లాడాలనే విజ్ఞప్తి కూడా చేస్తున్నారు.

Also Read: చిరంజీవిని కామెడీ హీరో అనుకుంటున్నారా.. ఆర్డరా, రిక్వెస్టా!

 సినిమాకి మంచి బజ్ వస్తున్న సమయంలో ఈ వివాదం రావడం కొంతమందికి మైలేజ్ ఇచ్చినా, సాంప్రదాయ ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో యూనిట్ దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఏది ఏమైనా టంగ్ అదుపులోలేకపోతే ఎంత పెద్ద హీరోకైనా, సినిమాకైనా ఇబ్బందని సినీ చరిత్ర చెప్తుంది.

Irumudi, Raviteja, Priya Bhavani Shankar

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com