.webp)
ఇరుముడి హవా ఆల్ షోస్ హౌస్ ఫుల్ తో చాలా స్పష్టంగా కొనసాగుతూ ఉంది. దీంతో ఇప్పటికే 136 కోట్ల క్లబ్ లోకి చేరగా, ఈ వీకెండ్ లో 200 కోట్ల క్లబ్ లోకి చేరవచ్చని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. థియేటర్స్ సంఖ్య కూడా పెరగడం అందుకు ఉదాహరణ. ఒక్క హైదరాబాద్ లోనే 70 స్క్రీన్ లు యాడ్ అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఇక ఈ చిత్రంలో టీచర్స్ ని విమర్శించారని ఏపి టీచర్స్ ఫెడరేషన్ కొన్ని రోజులుగా తమ ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ విషయంపై మేకర్స్ తో పాటు అభిమానులు, ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ 'సినిమాలో టీచర్స్ వ్యవస్థని ఏమి అనలేదు. వ్యక్తి యొక్క చెడుని మాత్రమే చూపించారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఇరుముడి ఇష్యుని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ దగ్గరకి చేరిందనే మాటలు వినపడుతున్నాయి.
ఏది ఏమైనా ఇరుముడి ప్రభంజనం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా దేదీప్య మానంగా కొనసాగుతు ఉంది.
[ Irumudi, Nara Lokesh, Raviteja, Shiva Nirvana, TeluguCinemaNews, TeluguCinema, Tollywood]






