Home

»

Latest News

ఇదెక్కడి టైటిల్ రా మావ

Mar 11, 2026

సినిమాను జనాల్లోకి తీసుకెళ్ళడంలో టైటిల్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే టైటిల్ విషయంలో మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. కంటెంట్ కి తగ్గ టైటిల్ ని ఎంచుకుంటూనే, అందరి దృష్టిని ఆకర్షించేలా చూసుకుంటారు. తాజాగా ఓ టైటిల్ అలాగే అందరి దృష్టిని ఆకర్షిస్తూ వైరల్ గా మారింది.

'లిటిల్ హార్ట్స్', 'రాజు వెడ్స్ రాంబాయి' వంటి సినిమాలతో హిట్స్ అందుకున్న ఈటీవీ విన్ నుంచి మరో సినిమా రాబోతుంది. వంశీ నందిపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని దర్శకులు. 

ఈ సినిమాకి 'ఇంకా ఏం అనుకోలేదు'(Inka Em Anukoledhu) అనే డిఫరెంట్ టైటిల్ ను ఖరారు చేయడం విశేషం. తాజాగా టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోను రిలీజ్ చేశారు. టైటిల్ కి తగ్గట్టుగానే ఆ వీడియో కూడా మీమ్ కంటెంట్ తో డిఫరెంట్ గా ఉంది. 

'ఇంకా ఏం అనుకోలేదు' ఈ ఏడాది సెప్టెంబర్ 4న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ చిత్రానికి సింజిత్ ఎర్రమిల్లి సంగీతం అందిస్తుండగా, రెహాన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

Also Read: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ 'పెన్నుమ్ పోరాట్టమ్'

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com