Home

»

Latest News

నా జీవితంలో సంతోషాన్నిచ్చే ఒకే ఒక పని అదే.. వైరల్ అవుతున్నప్రముఖ నటి మాట 

Aug 18, 2026 2:25PM

 

ఇనయ సుల్తానా.. అందానికే అసూయ పుట్టెంత అందం తన సొంతం. ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ కి కటీఫ్ చెప్పేసింది. గతంలో తనే ఎంతో వైభవంగా బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది. ఆ సమయంలో ఆమె ఆనందాన్ని చూసి ఆ ఇద్దరు కలకాలం కలిసి ఉండాలని దీవించారు. కానీ ప్రస్థుతానికి ఇనయ సింగిల్. 

ఇనయ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు సాధారణ వ్యక్తులు చేసిన పని లేదా మాట్లాడిన మాట అంతగా వైరల్ అవ్వదు.., కానీ సెలబ్రిటీలు మాట్లాడితే మాత్రం మీడియా దాన్ని పెద్దది చేస్తుంది. ఇది పీఆర్ గేమ్స్‌లో భాగం కావచ్చు. సినిమా ప్రమోషన్ల కోసం కూడా ఇలా జరుగుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో నేను  జిమ్ ఫోటోలు ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటాను. నేను డిప్రెషన్‌లో ఉన్నాను. దాన్ని అధిగమించడానికి కొత్త విషయాలని  అన్వేషించాలని అనుకుంటున్నాను. జిమ్ నా జీవితంలో ఒకే ఒక సంతోషాన్నిచ్చే పని . డబ్బుతో ప్రపంచంలో ఏదైనా కొనవచ్చు.  కానీ శరీరాన్ని కొనలేం, మార్చలేం. జిమ్‌లో కష్టపడి శరీరాన్ని మార్చుకోవడం వల్ల లభించే సంతృప్తి చాలా గొప్పది, అందుకే  కేవలం జిమ్ ఫోటోలు మాత్రమే ఇన్ స్టాలో షేర్ చేస్తానని  స్పష్టం చేశారు.  


also Read: ఎందుకు వెళ్లిపోయిందో తెలిసింది.. కేరళ యూట్యూబర్ అఖిల్ భార్య సంచలనం

బిగ్ బాస్ షో ద్వారా  పాపులర్ అయిన ఇనయ  సినిమాలు, టీవీ షోలలో కనిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన హవా డల్ నెస్ ని సొంతం చేసుకుంది. 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com