బ్రతకాలంటే టైమ్ కావాలి.. ఇన్ టైమ్ రివ్యూ!
on May 21, 2024
ప్రతీ మనిషి పూర్వం వంద సంవత్సరాలు.. ఆ పైబడి జీవచించేవారు. మరిప్పుడు అరవై డెబ్బై ఏళ్ళకే ఏదో ఒక జబ్బు వచ్చి చనిపోతున్నారు. అయితే ఇన్ టైమ్ అనే సైన్స్ ఫిక్షన్ మూవీ చూస్తే మనం బ్రతికే విధానం.. మనం టైమ్ గురించి ఆలోచించే విధానమే మారిపోతుంది.
'ఇన్ టైమ్(IN TIME)' అనే పేరుతో హాలివుడ్ లో రిలీజైన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. టైమ్ విలువని తెలియజేసేలా మేకర్స్ ఈ మూవీని తీసుకొచ్చారు. ఈ సినజమా కథేంటో ఓసారి చూసేద్దాం... ఈసినిమా ఓ వంద సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో చూపిస్తుంది. అప్పుడు అందరు డిజిటల్ మీడియా మీదే అధారపడి ఉంటారు. ప్రతీ ఒక్కరు పుట్టడమే చేతికి టైమ్ తో పుడతారు. అందులో ఎవరి జీవితం ఎంత టైమ్ వరకో రాసి ఉంటుంది. అయిన మనిషి కష్టపడి పనిచేస్తే టైమ్ పెరుగుతుంది. అయితే బాగా డబ్బున్న వాళ్ళు వారి జీవితకాలాన్ని వేల సంవత్సరాల వరకు టైమ్ పెంచుకుంటారు. పేదవారికి మాత్రం తక్కువ టైమ్ ను ఇస్తారు. ఇక హీరో యొక్క తల్లికి టైమ్ ముగియడంతో తను చనిపోతుంది. అది భరించలేని హీరో.. బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర టైమ్ ని దోచేయాలని అనుకుంటాడు. అదేసమయంలో అతనికి హీరోయిన్ నచ్చుతుంది. ఇక తను కూడా హీరో మార్గాన్నే ఎన్నుకుంటుంది. ఇక బాగా డబ్బున్న వారి దగ్గర హీరో, హీరోయిన్ కలిసి టైమ్ దొంగిలించి టైమ్ కొనుక్కోలేనివారికి ఇస్తారు.
టైమ్ ఎంతుంటే వారు అన్ని సంవత్సరాలు జీవిస్తారు. సినిమా మొదలైన నుండి ముగిసేవరకు ఉత్కంఠభరితంగా సాగుతుంది. మన ఫ్యూచర్ జెనరేషన్ టెక్నాలజీ పేరుతో వారి జీవితాలని ఎలా నాశనం చేసుకుంటారో తెలియజేస్తూ సాగుతుంది. టైమ్ ఉంటే ఓ సారి ఈ 'ఇన్ టైమ్' ని చూసేయ్యండి.