చనిపోవాలనుకున్నాను!
on Nov 6, 2017
ఇలియానా ఆత్మహత్య చేసుకోవాలనుకుందట. కారణం ఏంటో తెలుసా? తన శరీరాకృతి గురించి గతంలో చాలామంది ఎగతాళిగా మాట్టాడేవారట. అందుకే.. కొన్నాళ్లు డిప్రషన్ లో ఉండిపోయిందట. తాను డిప్రెషన్ లో ఉన్న సంగతి కూడా ఎవరో చెప్పేదాకా కూడా తనకు తెలీదట. ఓ రోజైతే... ఏకంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుందట. ఈ విషయాలన్నీ డైరెక్ట్ గా ఇల్లూ బేబీనే... చెప్పుకొచ్చింది. ఢిల్లీలో నిర్వహించిన వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ మెంటల్ హెల్త్ అనే కార్యక్రమానికి ఈ భామ హాజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన జీవితంలో ఎదుర్కొన్న ఒత్తిళ్ల గురించి వివరించింది.
‘చనిపోవాలని అనుకున్నాను. కానీ.. తర్వాత నాకు నేనే ధైర్యం చెప్పుకొని మళ్లీ నార్మల్ స్టేజ్ కి వచ్చాను. శరీరానికి దెబ్బ తగిలితే.. మనం డాక్టర్ ని సంప్రదిస్తాం. కానీ.. మనసుకు గాయం అయితే.. మాత్రం నిర్లక్ష్యం చేస్తాం. అదే తప్పు.. మనసుకు గాయమైనా.. కచ్చితంగా డాక్టర్ ని కలవాల్సిందే.
మనిషి అందంగా ఉండాలంటే... ముందు మససు ప్రశాంతంగా ఉండాలి. రెండు గంటలు మేకప్ లో కూర్చుంటే అందంగా ఉంటాం. కానీ.. ఏ మేకప్పూ లేకపోయినా.. మనసు ప్రశాంతంగా ఉంటే అందంగా కనిపిస్తాం..’ అంటూ అక్కడి వారందరికీ ప్రైవేటు చెప్పేసింది ఇలియానా. ఏది ఏమైనా అమ్మాయి చెప్పిన మాటలు మాత్రం మంచి మాటలే. ఏమంటారు?