షాక్.. నెట్లో ఇలియానా కోసం సెర్చ్ చేస్తే హ్యాక్ అయినట్టే.!!
on Oct 6, 2018
రామ్ హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన 'దేవదాసు' సినిమాతో ఇలియానా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తరువాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ మధ్య టాలీవుడ్ లో కనిపించడం తగ్గించిన ఇలియానా బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ కూడా మంచి పేరే తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఇలియానా గురించి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది.
ఇలియానా కోసం నెట్లో సెర్చ్ చేశారో.. ఇక అంతే సంగతులు. మీ ఫోన్‌లోని డేటా మొత్తం హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఓ సైబర్ సెక్యూరిటీ కంపెనీ MCA free స్వయంగా వెల్లడించింది. ఇలియానాకి ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని హ్యాకర్లు ఆమెకు సంబంధించిన ఫోటోలు, వార్తల్లో వైరస్‌లను జొప్పిస్తున్నారని సైబర్ సెక్యూరిటీ కంపెనీ తెలిపింది. ఇలియానాకు సంబంధించి వచ్చే ఫోటోలు, వార్తల లింక్‌లపై క్లిక్ చేస్తే కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లలోని సమాచారం మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుందని సైబర్ సెక్యూరిటీ సంస్థ హెచ్చరిస్తోంది. దీంతో దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన సెలబ్రిటీగా ఇలియానా మారిపోయింది.