భాగమతి భయపెడుతుంది
on Nov 7, 2017
అనుష్క ‘భాగమతి’ సినిమా ప్రారంభం నుంచి ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంది. అసలు ‘భాగమతి’ అంటే ఏంటి? కులి కుతుబ్ షా నాటి హిస్టరీ ఏమన్నా తీస్తున్నారా? అనే అనుమానం కూడా చాలా మందిలో కలిగిస్తూ వచ్చింది. అయితే.. ‘భాగమతి’ ఓ హారర్ థ్రిల్లర్ అని ఫస్ట్ లుక్ తో క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు అశోక్. ‘పిల్ల జమీందర్’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్న అశోక్.. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రూపొందించాడు. ఫస్ట్ లుక్ లో అనుష్క గెటప్ ఆస్తకిని రేకెత్తిస్తోంది. తనకు తానే అరచేతిలో మేకు దిగ్గొట్టుకొని, మరో చేత్తో సుత్తి పట్టుకొని జుత్తు విరబోసుకొని నిలబడ్డ అనుష్క గెటప్ చూస్తే.. ఇందులో హారర్ ఓ రేంజ్ లో ఉండబోతోందని అర్థమవుతుంది. పక్కనే ఎవరో బంధింపడ్డ స్త్రీ ఉరితో వేళ్లాడుతున్నట్టుగా కూడా ఉంది. నిజంగా ఈ ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు పెరగడం ఖాయం. యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.