చిరంజీవి ఇంట్లో చోరీ?
on Nov 6, 2017
చిరంజీవి గారింట్లో దొంగలు పడ్డారట. ఆయన ఇంటి పని పనిషి చెన్నయ్య రెండు లక్షలు దొంగిలించాడట. చిరంజీవిగారి మేనేజర్ గంగాధర్.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాడు. పోలీసులొచ్చి.. సి.సి. పుటేజ్ పరిశీలించి చెన్నయ్యను అరెస్ట్ చేశారు. మెగాస్టార్ ఇంట్లో రెండు లక్షలు దొంగిలించే ప్రయత్నం చేయడం నిజంగా ఎంత సాహసం?. అతనికి ఎంత అవసరం అయినా ఉండనీ.. అతనికి ఎన్ని బాధలైనా ఉండనీ.. దొంగతనం అనేది మాత్రం చాలా తప్పు. దానికి శిక్ష అనుభవించాల్సిందే.
ఈ చెన్నయ్య గత కొన్నేళ్లుగా చిరంజీవి ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. బాగా చేయి తిరిగిన వంట మాస్టర్ అట. రెండు లక్షలు(ఇంత పెద్ద మొత్తం) దొంగతనం జరిగినా..చిరంజీవి స్పందించలేదు. ఆ పనిమనిషిని పోలీసులకు అప్పజెప్పి.. మౌనంగా ఉండిపోయారు. దీన్ని బట్టి చిరంజీవి మంచితనం ఏంటో అర్థమవుతుంది.
మరిచిపోయా... ‘సైరా నరసింహారెడ్డి’ సొంత సినిమానే అయినా.. చిరంజీవి రెమ్యునరేషన్ గా వాళ్లు అంచనా వేసిన మొత్తం కేవలం 40 కోట్లు మాత్రమే నట. సొంత సినిమా అయినా.. వ్యాపారం వ్యాపారమే కదా. ఏది ఏమైనా... ఎన్ని కష్టాలున్నా... చిరంజీవి లాంటాయన ఇంట్లో రెండు లక్షల(అంత పెద్ద మొత్తం) దొంగిలించబూనడం.. చెన్నయ్య చేసిన తప్పిదమే. పేదరికంలో మగ్గితే.. చిరంజీవి ఇంట్లో దొంగతనం చేయాలా? తప్పు కదూ.