English | Telugu

Latest News

Bollywood News

రూట్ మార్చిన హెబ్బా పటేల్.. సునీల్ తో 'గీత'!

హెబ్బా పటేల్, సునీల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'గీత'. 'మ్యూట్ విట్నెస్' అన్నది ఉప శీర్షిక. వీవీ వినాయక్ ప్రియశిష్యుడు 'విశ్వా.ఆర్.రావు'ను దర్శకుడిగా పరిచయం చేస్తూ 'గ్రాండ్ మూవీస్' బ్యానర్ పై ఆర్.రాచయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

'అన్ స్టాపబుల్' బాలయ్య.. నవంబర్ 4 నుండి షురూ!

నటసింహం నందమూరి బాలకృష్ణ డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా'లో ఆయన ఒక టాక్ షో చేస్తున్నారు. 'unstoppable with nbk' పేరుతో రానున్న ఈ షోకి సంబంధించిన అధికారిక ప్రకటన కార్యక్రమం నేడు(గురువారం) ఘనంగా జరిగింది.

'ఆర్ఆర్ఆర్' టీజ‌ర్ కి ముహూర్తం ఫిక్స్!

`బాహుబ‌లి` సిరీస్ త‌రువాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి నుంచి రాబోతున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో రూపొందిన ఈ క్రేజీ మ‌ల్టిస్టార‌ర్ లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్, విదేశీ సోయ‌గం ఓలివియా మోరీస్ నాయిక‌లుగా న‌టించారు.

'మ‌హాస‌ముద్రం' మూవీ రివ్యూ

'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజ‌య్ భూప‌తి డైరెక్ట్ చేస్తున్న రెండో సినిమా.. శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ క‌లిసి న‌టిస్తోన్న సినిమా అనేస‌రికి 'మ‌హాస‌ముద్రం'పై సినీ ప్రియుల్లో క్రేజ్ వ‌చ్చింద‌నేది నిజం. పాట‌లు, ట్రైల‌ర్ సినిమాపై ఆస‌క్తిని రెట్టింపు చేశాయి. విడుద‌ల‌య్యే స‌మయానికి 'మ‌హాస‌ముద్రం'పై చాలా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి.. మ‌న ముందుకు వ‌చ్చిన ఆ సినిమా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే ఉందా...

విరాట్ కోహ్లీ బయోపిక్‌ లో నటించాలనుంది

అక్కినేని వారసుడిగా 'అఖిల్' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ మొదటి మూడు సినిమాలతో(అఖిల్, హలో, మిస్టర్ మజ్ను) నిరాశ పరిచాడు. ఫస్ట్ హిట్ కోసం తపిస్తున్న ఈ అక్కినేని హీరో.. త్వరలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.

'RT 69' లోనూ మ‌రో సీనియ‌ర్ హీరో!

`క్రాక్`తో మళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చేసిన మాస్ మ‌హారాజా ర‌వితేజ.. త్వ‌ర‌లో `ఖిలాడి`, `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రాల‌తో సంద‌డి చేయ‌నున్నారు. త‌క్కువ గ్యాప్ లోనే ఈ రెండు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్స్ కూడా థియేట‌ర్స్ లోకి రాబోతున్నాయి.

బాలయ్య టాక్ షో సందడి షురూ.. గెస్ట్ లు ఎవరో తెలిస్తే షాక్!

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా'లో నటసింహం నందమూరి బాలకృష్ణ ఓ టాక్ షో చేయబోతున్న సంగతి తెలిసిందే. 'అన్ స్టాపబుల్' పేరుతో త్వరలోనే బాలయ్య బుల్లితెరపై సందడి చేయనున్నారు. ఇప్పటికే ఆహా ఈ షో గురించి 'బాప్ ఆఫ్‌ ఆల్ టాక్ షోస్.. అన్ స్టాపబుల్' అంటూ ఓ రేంజ్ లో పబ్లిసిటీ చేస్తోంది.

ట్రెండ్ సెట్టింగ్ మూవీ 'నువ్వే కావాలి'కి 21 ఏళ్ళు!

తెలుగునాట ఆడ - మ‌గ స్నేహం చుట్టూ అల్లుకున్న చిత్రాలు చెప్పుకోద‌గ్గ స్థాయిలో వ‌చ్చినా.. ట్రెండ్ సెట్ చేసిన సినిమా మాత్రం ఒక‌టే. ఆ చిత్ర‌మే.. `నువ్వే కావాలి`. మాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `నిర‌మ్` (కుంచ‌కో బోబ‌న్, షాలిని) ఆధారంగా రూపొందిన ఈ యూత్ ఫుల్ ఎంట‌ర్టైన‌ర్ తో త‌రుణ్, రిచా హీరోహీరోయిన్లుగా తొలి అడుగేశారు.

'పుష్ప' నుంచి 'శ్రీవల్లి' సాంగ్ వచ్చేసింది.. తగ్గేదేలే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'పుష్ప'. ఇందులో పుష్ప రాజ్ గా బన్నీ, శ్రీవల్లిగా రష్మిక కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లిమ్ప్స్, ఫస్ట్ సింగిల్ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా పుష్ప నుంచి సెకండ్ సాంగ్ విడుదలైంది.

ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్‌లోని 11 మంది రాజీనామాతో మంచు విష్ణుకు బంప‌ర్ ఆఫ‌ర్‌!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో గెలుపొందిన‌ ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్‌కు చెందిన 11 మంది రాజీనామా చేయ‌డంతో, మంచు విష్ణు ప్యాన‌ల్‌లో ఓడిన స‌భ్యుల‌కు ఆ స్థానాల‌ను భ‌ర్తీ చేసే గోల్డెన్ చాన్స్ ల‌భించింది. ప్రెసిడెంట్‌గా త‌న‌కున్న ప‌వ‌ర్‌తో ప్ర‌కాశ్‌రాజ్ శిబిరానికి చెందిన 11 మంది స‌భ్యుల స్థానాల్లో త‌న ప్యాన‌ల్ మెంబ‌ర్స్‌ను తీసుకొనే చాన్స్ విష్ణుకు దొరికింది. మా ఎల‌క్ష‌న్స్‌లో ఒకే ప్యాన‌ల్ గెల‌వాల‌నే కోరిక ఈ ర‌కంగా నెర‌వేరుతుండ‌టం 'మా' హిస్ట‌రీలోనే ఫ‌స్ట్ టైమ్.

మోహ‌న్‌బాబు అర‌గంట సేపు ప‌చ్చిబూతులు తిట్టారు.. భోరున విల‌పించిన బెన‌ర్జీ!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు జరిగిన విదానం సరిగా లేదంటూ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ప్యానల్.. మంచు విష్ణు ప్యానల్ పై ఆరోపణలు చేస్తోంది. తాజాగా తన ప్యానల్ సభ్యులతో కలిసి ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

'మా' ఎన్నిక‌ల్లో రౌడీయిజం జ‌రిగింది.. మావాళ్లు 11 మంది రాజీనామా చేస్తున్నారు!

అనుకున్న‌ట్లుగానే 'మా' ఎన్నిక‌ల్లో గెలిచిన ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్‌కు చెందిన 11 మంది మూకుమ్మ‌డిగా రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వారి త‌ర‌పున ఆ విష‌యాన్ని ప్యాన‌ల్ లీడ‌ర్ ప్ర‌కాశ్‌రాజ్ ప్ర‌క‌టించారు. లేటెస్ట్‌గా ఫిల్మ్‌న‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్‌లో ఏర్పాటుచేసిన మీడియా స‌మావేశంలో త‌న ప్యాన‌ల్ మెంబ‌ర్స్‌తో క‌లిసి పాల్గొన్నారు ప్ర‌కాశ్‌రాజ్‌. మా ఎన్నిక‌ల్లో రౌడీయిజం జ‌రిగింద‌ని తాజాగా ఆయ‌న ఆరోపించారు. 

ప్ర‌భాస్ తో శ్ర‌ద్ధ చిందులు!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ గ‌త చిత్రం `సాహో`లో క‌థానాయిక‌గా క‌నువిందు చేసింది బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్. క‌ట్ చేస్తే.. త్వ‌ర‌లో ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్ మ‌రోమారు ప్ర‌భాస్ తో జ‌ట్టుక‌ట్ట‌నుంద‌ట‌.

ధ‌ర్మేంద్ర కొన్న ఈ ఫియ‌ట్ కారు ధ‌ర‌.. జ‌స్ట్ 18 థౌజండ్‌!

బాలీవుడ్ వెట‌ర‌న్ స్టార్ ధ‌ర్మేంద్ర ఒక బ్లాక్ ఫియ‌ట్ కారును కొన్నారు. దాని ధ‌ర ఎంతో తెలుసా? జ‌స్ట్‌.. రూ. 18 వేలు. అవునా! అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? అయితే ఆయ‌న ఆ కారును కొన్న‌ది ఇప్పుడు కాదు. 1960లో! పైగా ఆయ‌న కొన్న మొట్ట మొద‌టి కారు కూడా అదే. ఇప్ప‌టికీ ఆ కారు ఆయ‌న గ్యారేజ్‌లో భ‌ద్రంగా ఉంది. ఆ కారుకు సంబంధించిన ఓ వీడియోను త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఆయ‌న షేర్ చేశారు.

'తుల‌సి'గా వెంకీ మెస్మ‌రైజ్ చేసి నేటికి 14 ఏళ్ళు!

ఫ్యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన చిత్రాలు.. సీనియ‌ర్ స్టార్ విక్ట‌రీ వెంక‌టేశ్ కి భ‌లేగా క‌లిసొచ్చాయి. వాటిలో.. `తుల‌సి` ఒక‌టి. మాస్ సినిమాల స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో పర్వ‌త‌నేని తుల‌సీరామ్ గా టైటిల్ రోల్ లో త‌న‌దైన అభిన‌యంతో మెస్మ‌రైజ్ చేశారు వెంకీ.

ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో నటించాలని ఉంది

లెజండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో నటించాలని ఉందని హీరోయిన్ అదితీరావు హైదరి తెలిపింది. ఆమె నటించిన 'మహా సముద్రం' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.

రాఘ‌వేంద్ర‌రావు లేక‌పోతే నేనేమైపోయేదాన్నో! ర‌మ్య‌కృష్ణ భావోద్వేగం!!

1980ల‌లోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ర‌మ్య‌కృష్ణ స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌డానికి ప్ర‌ధానంగా దోహ‌దం చేసింది కె. రాఘ‌వేంద్ర‌రావు సినిమాలే. 'అల్లుడుగారు' సినిమాలో తొలిసారిగా రాఘ‌వేంద్రరావు డైరెక్ష‌న్‌లో న‌టించారు ర‌మ్య‌కృష్ణ‌. అందులో మూగ‌మ్మాయిగా, మోహ‌న్‌బాబు భార్య‌గా కొద్దిసేపు క‌నిపించే పాత్ర‌లో క‌నిపించారు. ఆ త‌ర్వాత 'అల్ల‌రి మొగుడు' సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా మోహ‌న్‌బాబు జోడీగానే చాన్స్ ఇచ్చారు ద‌ర్శ‌కేంద్రుడు. 

స‌మంత‌కూ, నాకూ మ‌ధ్య ఉన్నదేంటో నాగ‌చైత‌న్య‌కు తెలుసు!

భార్యాభ‌ర్త‌లుగా విడిపోతున్నామ‌ని నాగ‌చైత‌న్య‌, స‌మంత ప్ర‌క‌టించ‌గానే, స‌మంత‌ను లెఫ్ట్‌, రైట్‌, సెంట‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు నెటిజ‌న్లు. త‌న స్టైలిస్ట్ ప్రీత‌మ్ జుకాల్క‌ర్‌తో బంధ‌మే చైతూతో ఆమె విడాకుల‌కు కార‌ణ‌మ‌ని చాలామంది త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తూ వ‌స్తున్నారు. ఇప్పుడు.. త‌న‌కూ, స‌మంత‌కూ అలాంటి ఎఫైర్ ఏమీ లేద‌ని నాగ‌చైత‌న్య నోరువిప్పి మాట్లాడితే, ఆ రూమ‌ర్స్‌కు చెక్ ప‌డుతుంద‌ని ప్రీత‌మ్ అంటున్నాడు.

మాస్ మ‌హారాజా 'ధ‌మాకా'!

`నేను లోక‌ల్` ఫేమ్ త్రినాథ‌రావ్ న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. మాస్ ఎంట‌ర్టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్.. ఈ నెల 4 నుంచి శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

'పెద్ద‌న్న‌'గా సూప‌ర్ స్టార్?

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ఈ దీపావ‌ళికి `అణ్ణాత్త‌`గా ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. నవంబ‌ర్ 4న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ భారీ బ‌డ్జెట్ మూవీ సంద‌డి చేయ‌నుంది.  `శౌర్యం` శివ డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ యాక్ష‌న్ డ్రామాలో న‌య‌న‌తార‌, కీర్తి సురేశ్, మీనా, ఖుష్బూ, జ‌గ‌ప‌తి బాబు, ప్ర‌కాశ్ రాజ్ వంటి భారీ తారాగ‌ణం క‌నువిందు చేయ‌నుంది.

బాలకృష్ణను కలిసిన విష్ణు, మోహన్ బాబు.. త్వరలోనే చిరంజీవిని కూడా కలుస్తా!

ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో అధ్యక్షుడుగా గెలిచిన మంచు విష్ణు తాజాగా నందమూరి బాలకృష్ణను కలిశారు. విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి బాలకృష్ణను ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు.

'భీమ్లా నాయక్' నుంచి 'అంత ఇష్టం' సాంగ్ ప్రోమో.. తమన్ మ్యాజిక్ రిపీట్!

పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'భీమ్లా నాయక్'. మలయాళ సూపర్ హిట్‌ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌'కు రీమేక్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ జోడీగా నిత్యా మీనన్, రానా జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు.

నాని 29వ సినిమా అప్డేట్ వచ్చేసింది!

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల 'టక్ జగదీష్' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాని.. ఇప్పటికే రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' మూవీ షూటింగ్ పూర్తి చేశాడు. అలాగే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'అంటే సుందరానికీ' సినిమా చేస్తున్నాడు.

చిరు కోసం బ్రిట్నీ స్పియ‌ర్స్ పాట‌!

బ్రిట్నీ స్పియ‌ర్స్.. సంగీత ప్రియుల‌కు ప‌రిచ‌యం చేయ‌నక్క‌ర్లేని పేరు. త‌నదైన గాత్రం, న‌ర్త‌నంతో చిరస్మ‌ర‌ణీయమైన ముద్ర వేసిన ఈ 40 ఏళ్ళ  అమెరిక‌న్ మ‌ల్టి టాలెంటెడ్.. త్వ‌ర‌లో మెగాస్టార్ కోసం టాలీవుడ్ బాట ప‌ట్ట‌నుంద‌ట‌.

అనుప‌మ‌కి మ‌రోసారి క‌లిసొచ్చేనా!

ద‌క్షిణాదిలోని అన్ని భాష‌ల్లోనూ విజ‌యాలు చ‌విచూసింది కేర‌ళ‌కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. మ‌రీముఖ్యంగా.. తెలుగునాట న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుందీ టాలెంటెడ్ యాక్ట్ర‌స్. ప్ర‌స్తుతం అనుప‌మ చేతిలో `రౌడీ బాయ్స్`, `18 పేజెస్`, `కార్తికేయ 2`, `హెలెన్` వంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

'మా' అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఈరోజు(బుధవారం ) బాధ్యతలను స్వీకరించారు. అనంతరం అధ్యక్ష హోదాలో పెన్షన్‌ ఫైల్‌ పై తొలి సంతకం చేశారు విష్ణు.

'హ్యాపీ బర్త్‌ డే ప్రేరణ'.. 'రాధేశ్యామ్' నుంచి కొత్త పోస్టర్

రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'రాధేశ్యామ్'. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్‌ వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది. నేడు(అక్టోబర్‌ 13) పూజా హెగ్డే బర్త్‌డే సందర్భంగా మూవీ టీమ్ ఆమెకు బర్త్‌డే విషెస్‌ తెలుపుతూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

'మా' రచ్చ.. మనోజ్‌ లేకపోతే కొట్టుకు చచ్చేవారు!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు మోహన్ బాబు కనుసైగల్లో జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో మోహన్ బాబు బూతులు తిట్టారని.. కొట్టడానికి కూడా యత్నించారని ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపించింది. అసలు అక్కడ మంచు మనోజ్ లేకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు అంటున్నారు.

బెన‌ర్జీపై చేయి చేసుకున్నారు.. పోస్ట‌ల్ బ్యాలెట్‌లో అక్ర‌మాలు.. ప్ర‌కాశ్‌రాజ్ ఆరోప‌ణలు!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్ష పోరులో పరాజయంపాలైన ప్రకాష్ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్యానల్‌ నుంచి గెలిచిన సభ్యులందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు.

మణిశర్మ ఇంట పెళ్లి సందడి.. సింగర్ సంజనాతో మహతి వివాహం

మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమారుడు, యువ సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. సింగర్ సంజనా కలమంజేతో ఈ నెల 24న ఆయన వివాహం జరగనుంది.

'NBK 107'.. 'జై బాల‌య్య‌'!

`జై బాల‌య్య‌`.. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ అభిమానుల నినాదం ఇది. ఇప్పుడీ నినాద‌మే.. బాల‌య్య కొత్త చిత్రానికి టైటిల్ కాబోతోంద‌ట‌.

అప్పుడు 'మిర్చి'.. ఇప్పుడు 'ఆచార్య‌'!

వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్న ద‌ర్శ‌కుల్లో విజ‌న‌రీ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఒక‌రు. `మిర్చి`, `శ్రీ‌మంతుడు`, `జ‌న‌తా గ్యారేజ్`, `భ‌ర‌త్ అనే నేను`.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో తెలుగునాట కెప్టెన్ గా త‌న‌దైన ముద్ర వేశారు శివ‌. త్వ‌ర‌లో ఈ స్టార్ డైరెక్ట‌ర్.. మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు.

'మా' స‌భ్యులు త‌మ స‌మాధుల్ని తామే త‌వ్వుకుంటున్నారు.. నాగ‌బాబు లేఖ క‌ల‌క‌లం!!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఫ్యూచ‌ర్ త‌ల‌చుకుంటే భ‌య‌మేస్తోంద‌నీ, మా స‌భ్యులు త‌మ స‌మాధుల్ని తామే త‌వ్వుకుంటున్నార‌నీ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు న‌టుడు నాగ‌బాబు. మా ఎన్నిక‌ల్లో మంచు విష్ణు గెలిచి, ప్ర‌కాశ్‌రాజ్ ఓడిపోవ‌డాన్ని ప్రాంతీయ‌వాదం, సంకుచిత‌వాదం గెలుపుగా అభివ‌ర్ణించిన ఆయ‌న త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఒక బ‌హిరంగ లేఖ‌ను షేర్ చేశారు.

"ఒక ప‌ద‌వి కోసం అంత లోకువ కావాలా?" అన్న చిరంజీవి.. కౌంట‌ర్ ఇచ్చిన మోహ‌న్‌బాబు!

పాతికేళ్ల చ‌రిత్ర‌లో ఎన్న‌డూ జ‌ర‌గ‌నంత వాడిగా, వేడిగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ 2021 ఎన్నిక‌లు జ‌రిగాయి. పోలింగ్ డేట్ అయిన అక్టోబ‌ర్ 10కి ఒక రోజు ముందు దాకా ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్ మెంబ‌ర్స్‌, మంచు విష్ణు ప్యాన‌ల్ మెంబ‌ర్స్ ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకున్నారు. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కూ పాల్ప‌డ్డారు. ఇండ‌స్ట్రీకి పెద్ద‌దిక్కు అనుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈ గొడ‌వ‌నంతా మౌనంగా తిల‌కిస్తూ వ‌చ్చారు. 

శ్రియ‌కు కూతురు పుట్టింది.. బ‌య‌ట‌పెట్ట‌కుండా సంవ‌త్స‌రం పాటు దాచింది!

శ్రియ‌, ఆమె భ‌ర్త ఆంద్రీ కొశ్చెవ్ త‌మ‌కు కూతురు పుట్టింద‌నే బిగ్ న్యూస్‌ను ఇండ‌స్ట్రీలోని క్లోజ్ ఫ్రెండ్స్‌, ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఆర్ఆర్ఆర్‌, గ‌మ‌నం సినిమాల్లో క‌నిపించ‌బోతున్న శ్రియ‌కు పండండి పాప జ‌న్మించింది. అవును. 2020లో ప్ర‌పంచ‌మంతా కొవిడ్ కార‌ణంగా సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్న సంద‌ర్భంలో, లిటిల్ ఏంజెల్ రాక‌తో త‌న ప్ర‌పంచం మారిపోయింద‌ని ఆమె వెల్ల‌డించింది.

'సత్యాగ్రహి' మూవీని గుర్తుచేసుకున్న పవన్.. ఆయనే కారణం!

తెలుగు రాష్ట్రాల్లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. హీరోగా ఆయన తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. అలాగే 'జనసేన' పార్టీని స్థాపించిన ఆయన రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు.

Short Films

Movie Reviews

Latest News

Video-Gossips


Gallery

'మ‌హాస‌ముద్రం'తో డిజ‌ప్పాయింట్ చేసిన అజ‌య్ భూప‌తి!

కార్తికేయ‌ను హీరోగా నిల‌బెట్టిన 'ఆర్ఎక్స్ 100' మూవీతో డైరెక్ట‌ర్‌గా అంద‌రి దృష్టినీ త‌న‌వైపు తిప్పుకున్నాడు అజ‌య్ భూప‌తి. రామ్‌గోపాల్ వ‌ర్మ శిష్యుడైన అత‌నికి అదే ఫ‌స్ట్ ఫిల్మ్‌. దాంతో టాలీవుడ్‌కు మ‌రో ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడు ల‌భించాడ‌ని అంద‌రూ సంతోష‌ప‌డ్డారు. ఆ సినిమాలో హీరో హీరోయిన్ల క్యారెక్ట‌ర్ల‌ను అత‌ను మ‌ల‌చిన విధానం, వాళ్ల మ‌ధ్య అత‌ను క‌ల్పించిన స‌న్నివేశాలు ఆక‌ట్టుకున్నాయి. 

ప్ర‌భాస్ తో క‌రీనా రొమాన్స్?

`సాహో`లో బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ తో రొమాన్స్ చేసిన యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్.. ప్ర‌స్తుతం `ఆదిపురుష్`లో కృతి స‌న‌న్, `ప్రాజెక్ట్ కే`లో దీపికా ప‌దుకోణ్ తో జ‌ట్టుక‌ట్టాడు. అంతేకాదు.. త‌న 25వ చిత్రం కోసం కూడా అదే బాట ప‌ట్ట‌నున్నాడ‌ట‌.

'పిల్ల జ‌మీందార్'గా నాని ఎంట‌ర్టైన్ చేసి నేటికి ప‌దేళ్ళు!

నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్ లో ప్ర‌త్యేకంగా నిలిచే సినిమాల్లో `పిల్ల జమీందార్` ఒక‌టి. `అలా మొద‌లైంది` (2011) వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత నాని నుంచి వ‌చ్చిన ఈ  చిత్రం కూడా విజ‌య‌ప‌థంలో ప‌య‌నించింది. ద‌క్షిణ కొరియా చిత్రం `ఎ మిలియ‌నీర్స్ ఫ‌స్ట్ ల‌వ్` (2006) ఆధారంగా రూపొందిన ఈ  న్యూ ఏజ్ కామెడీ డ్రామాని జి. అశోక్ డైరెక్ట్ చేశారు.

'మంచిరోజులు వచ్చాయి' ట్రైలర్.. మారుతి మార్క్ కామెడీ!

'ప్రతిరోజూ పండగే' తర్వాత మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా 'మంచిరోజులు వచ్చాయి'. ఈ సినిమాలో సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకోగా.. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.

మొత్తానికి హిట్ కొట్టేసిన‌ నాని హీరోయిన్!

నేచుర‌ల్ స్టార్ నాని టైటిల్ రోల్ లో న‌టించిన `గ్యాంగ్ లీడ‌ర్`తో తెలుగునాట క‌థానాయిక‌గా తొలి అడుగేసింది ప్రియాంక అరుళ్ మోహ‌న్. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే ఇక్క‌డి వారిని మురిపించినా.. క‌మ‌ర్షియ‌ల్ హిట్ నైతే త‌న ఖాతాలో వేసుకోలేక‌పోయింది. ఈ నేప‌థ్యంలో.. మ‌రో యంగ్ హీరో శ‌ర్వానంద్ న‌టించిన `శ్రీ‌కారం`పై ఆశ‌లు పెట్టుకుంది

ప్ర‌కాశ్‌రాజ్ రాజీనామా ఒక‌ డ్రా'మా'! కాదంటారా?!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ 2021 ఎన్నిక‌లు ఎంత ర‌స‌వ‌త్త‌రంగా, ఎంత కాంట్ర‌వ‌ర్షియ‌ల్‌గా, ఎంత ర‌చ్చ‌ర‌చ్చ‌గా జ‌రిగాయో చూశాం. మెగా బ్ర‌ద‌ర్స్ మ‌ద్ద‌తు పుష్క‌లంగా ల‌భించిన ప్ర‌కాశ్‌రాజ్ 'మా' అధ్య‌క్షుడిగా ఈజీగా గెలుస్తాడ‌నుకుంటే, మారిన ప‌రిణామాల మ‌ధ్య తెలుగు న‌టుల్లో అత్య‌ధికులు ఒక్క‌టై మంచు విష్ణుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించారు. ఇది ప్ర‌కాశ్‌రాజ్‌కే కాకుండా మెగా బ్ర‌ద‌ర్స్‌కు కూడా షాక్‌ను క‌లిగించింది. 

వెంకీ 'వార‌సుడొచ్చాడు'కి 33 ఏళ్ళు!

విక్ట‌రీ వెంక‌టేశ్ కెరీర్ లో ప్ర‌త్యేకంగా నిలిచే చిత్రాల్లో `వార‌సుడొచ్చాడు` ఒక‌టి.  కోలీవుడ్ యాక్ట‌ర్, డైరెక్ట‌ర్ మ‌ణివ‌ణ్ణ‌న్ రూపొందించిన త‌మిళ సినిమా `తీర్థ క‌రైయినిలే` (మోహ‌న్, రూపిణి) ఆధారంగా తెర‌కెక్కిన ఈ విలేజ్ ఫ్యామిలీ డ్రామాకి ఎ. మోహ‌న్ గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

మ‌హేశ్‌, బ‌న్నీ ప‌నే బాగుంది.. 'మా' ర‌చ్చ‌కు దూరంగా ఫ్యామిలీస్‌తో ఎంజాయ్ చేస్తూ...!

హైద‌రాబాద్‌లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల ర‌చ్చ ఎలా ఉందో వారం రోజుల పైగా చూస్తున్నాం. ప్ర‌కాశ్‌రాజ్‌, మంచు విష్ణు ప్యాన‌ళ్ల మ‌ధ్య ఒక యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన‌డం చూశాం. న‌రేశ్‌, నాగ‌బాబు.. ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకోవ‌డం, వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు చేసుకోవ‌డం చూసి ఆశ్చ‌ర్య‌పోయాం. ప్ర‌కాశ్‌రాజ్‌ను ఔట్‌సైడ‌ర్‌గా న‌రేశ్‌, మ‌రికొంత‌మంది చిత్రించ‌డం గ‌మ‌నించాం. 

'మా' ఎన్నికల అధికారి కీలక వ్యాఖ్యలు.. అదంతా అబద్దం!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. మా ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రకాష్ రాజ్ & టీమ్.. మంచు విష్ణు ప్యానల్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఎన్నికల సమయంలో మోహన్ బాబు బూతులు తిట్టారని, సీనియర్ నటుడు బెనర్జీ పై చేయి కూడా చేసుకోబోయారని ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపించారు.

మా అమ్మ‌ను కించ‌పరిచేలా మోహ‌న్‌బాబుగారు బూతులు తిట్టారు.. అమ్మే నా స‌ర్వ‌స్వం!!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల త‌ర్వాత ప‌రిణామాలు మ‌రో ర‌కంగా ట‌ర్న్ తీసుకుంటున్నాయి. విష్ణు స‌జావుగా త‌న బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించ‌డానికి వీలుగా ఎన్నిక‌ల్లో గెలిచిన త‌మ సినిమా బిడ్డ‌లం ప్యాన‌ల్ మెంబ‌ర్స్ 11 మంది రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌కాశ్‌రాజ్ ప్ర‌క‌టించారు. ఆయ‌న నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఎన్నిక‌ల రోజు మోహ‌న్‌బాబు త‌న‌ను బూతులు తిట్టార‌నీ, వాటిలో త‌మ అమ్మ‌ను కించ‌ప‌రిచే బూతులు వ‌చ్చాయ‌నీ...

మై డియ‌ర్ విష్ణుగారూ.. నా రాజీనామాను వాప‌స్ తీసుకుంటా.. బ‌ట్ వ‌న్ కండిష‌న్‌!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి తాను చేసిన రాజీనామాను ఉప‌సంహ‌రించుకుంటాన‌ని ప్ర‌కాశ్‌రాజ్ ప్ర‌క‌టించారు. అయితే తెలుగువాడు కానివాడు మా ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి వీల్లేదు అంటూ బైలాస్ మార్చ‌క‌పోతేనే ఆ ప‌ని చేస్తాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌వారం సాయంత్రం మీడియా మీట్‌లో మాట్లాడిన ఆయ‌న‌, మా ఎన్నిక‌ల్లో గెలుపొందిన త‌మ ప్యాన‌ల్ స‌భ్యులు 11 మంది..

ఒకే బాట‌లో రాశి, అను!

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా న‌టించిన `ఆక్సిజ‌న్`(2017)లో క‌థానాయిక‌లుగా క‌నువిందు చేశారు రాశీ ఖ‌న్నా, అను ఇమ్మాన్యుయేల్. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఈ ఇద్ద‌రు భామ‌లు కూడా ఒకే బాట‌లో ప‌య‌నిస్తున్నారు.

ప్ర‌కాశ్‌రాజ్ వ‌ర్గం మూకుమ్మ‌డి రాజీనామాల‌కు సిద్ధం? 'మా'కు పోటీగా మ‌రో సంఘం?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అక్టోబ‌ర్ 10న జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధ్య‌క్షునిగా మంచు విష్ణు గెల‌వ‌గా, ఆఫీస్ బేర‌ర్స్‌గా అధిక శాతం మంది ఆయ‌న ప్యాన‌ల్ వారే ఎన్నిక‌య్యారు. అయితే ప్రాంతీయ‌వాదం, సంకుచిత మ‌న‌స్త‌త్వంతో మా కొట్టుమిట్టాడుతోంద‌ని ఆరోపిస్తూ, నాగ‌బాబు త‌న 'మా' స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌గా, ప్రెసిడెంట్‌గా పోటీచేసి, ఓటమి పాలైన ప్ర‌కాశ్‌రాజ్ సైతం అదే బాట అనుస‌రించారు. 

మ‌హేశ్ తో పాయ‌ల్ రొమాన్స్?

`ఆర్ ఎక్స్ 100`తో తెలుగు తెరపైకి దూసుకొచ్చిన అందం.. పాయ‌ల్ రాజ్ పుత్. మొద‌టి తెలుగు చిత్రంతోనే సంచ‌ల‌నం సృష్టించిన ఈ సొగ‌స‌రి.. ఆపై `వెంకిమామ‌`లో విక్ట‌రీ వెంక‌టేశ్ కి జోడీగా, `డిస్కోరాజా`లో మాస్ మ‌హారాజా ర‌వితేజ‌కి జంట‌గా క‌నువిందు చేసింది.

నిర్మాత మహేష్ కోనేరు హఠాన్మరణం.. ఎన్టీఆర్ భావోద్వేగం!

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు ఈరోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూసారు. మహేష్ మృతికి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.