మీ ఇంట్లో ఆడాళ్లు లేరా?
on Aug 21, 2017
ఎవడో.. ఏదో చిలిపి పని చేశాడనీ.. యావత్ ప్రపంచాన్నే అల్పమైనదనీ... సంకుచితమైందని నిందించడం సమంజసమేనా.. అహ.. సబబేనా అంట? ఇంతకీ ఈ నిందారోపణలు ఎవరివో చెప్పనేలేదు కదూ... మన గోవా భామ ఇలియానావి. ఈవిడగారి పట్ల ఎవడో చేసిన వికృత చేష్ట.. ప్రపంచాన్నే నిందించేలా చేసింది. మరి ఎక్కడ జరిగిందో... ఏం జరిగిందో పూర్తి వివరాలైతే తెలుపలేదు కానీ... ట్విట్టరెక్కేసి మరీ.. తన బాధను వెల్లబోసుకుంది ఇలియానా.
‘మనం ఉంటుంది.. సంకుచితమైన అల్పమైన ప్రపంచం. ఇలాంటి మనుషుల మధ్య నేనూ ఓ మనిషిలా బతుకుతున్నందుకు బాధగా ఉంది. పబ్లిక్ ఫిగర్ అవ్వడం నా తప్పా? బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తిగత జీవితం నాకు ఉండదని తెలుసు. అంత మాత్రంచేత నాపై అసభ్యంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు. మీ ఇంట్లో మీ ఆడాళ్లు లేరా? నేను కూడా అలాంటి ఆడదాన్నే. గుర్తుంచుకోండి’ అని ఘాటుగానే స్పందించింది ఇలియానా.
పాపం... అసలే తెలుగులో సినిమాల్లేవు. బాలీవుడ్డు కెళ్లి ఏమయినా ఉద్ధరించిందా.. అంటే అదీ లేదు. చేసిన సినిమాలన్నీ దాదాపు ఫ్లాపులే. హీరోయిన్ గా చేసిన తొలి సినిమా ‘బర్ఫీ’హిట్ అయ్యిందేగానీ... క్రెడిట్ మొత్తం రణబీర్ కపూర్, ప్రియాంక చోప్రా పట్టుకెళ్లిపోయారు. ఆ తర్వాత ‘రుస్తుం’ రూపంలో మరో హిట్ వచ్చిందిలే అనుకుంటే... ఆ క్రెడిట్ మొత్తం అక్షయ్ కుమార్ ఖాతాలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఏదో చిన్నచితకా సినిమాలు చేసుకుంటూ, అడపాదడపా ఫొటోషూట్లతో టైమ్ పాస్ చేస్తూ అలా అలా కాలం గడిపేస్తుంది ఇలియానా.
అసలే ఫ్రెస్టేషన్లో ఉన్న ఈ గోవాభామను ఈ రేంజ్ లో ఇరిటేట్ చేసిన ఆ బడుద్ధాయ్ ఎవరా అని? హన్నన్నా.... తన్నేవాడు లేకపోతే సరి.