ఇలియానా మరీ ఇంత పబ్లిగ్గానా.?
on Nov 15, 2016
దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై..నడుము అందాలతో కుర్రకారుకు గిలిగింతలు పెట్టింది గోవా బ్యూటీ ఇలియానా..ఆ సినిమా సక్సెస్‌తో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసి టాప్ హీరోయిన్‌గా ఓ వెలిగింది..ఇక్కడ కెరిర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే ముంబైకి మకాం మార్చేసింది. ఉన్నది పోయే..ఉంచుకున్నది పోయే అన్నట్లు అక్కడ హిట్లు రాకపోగా..టాలీవుడ్ నుంచి కాల్స్ లేక ఇల్లీ బేబి తెగ సఫర్ అయ్యింది. ఇక చేసేదేముంది అందరు హీరోయిన్ల లాగే ఇక పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలైపోదాం అనుకున్నట్టుంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ అండ్రూతో గోవాబ్యూటీ ప్రేమాయణం నడుపుతోందన్నది అందరికీ తెలిసిన విషయమే. వీరిద్దరూ 2014 నుంచి సహజీవనం చేస్తున్నట్లు, గత డిసెంబర్‌లో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. అయితే అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి అనుకుంటున్న టైంలో తన బాయ్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సెగలు పుట్టిస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా మరీ ఇంతా పబ్లిగ్గానా అంటూ ముక్కున వెలేసుకుంటున్నారు.