నేను పబ్లిక్ ఫిగర్‌ని... పబ్లిక్ ప్రాపర్టీని కాదు!
on Sep 11, 2017
‘మీకు మనసు లేదా? మనుషులు కారా? మానవత్వం కరువైందా? మీ తోబుట్లువుల దగ్గర కూడా ఇలాగే ప్రవర్తిస్తారా?..’ ఓరి నాయనో! ఇవే కాదు... ఇంకా చాలా అనేసింది మీడియాను ఇలియానా. ఇంతకీ ఈ గోవాభామకు అంత కోపం రావడానికి కారణం ఏంటో చెప్పనే లేదు కదూ. ‘బర్ఫీ’ తర్వాత... బాలీవుడ్ లో విజయం కరువైపోయి... విలవిలాడిపోయిన ఇలియానా... రుస్తుం, బాద్ షా హో చిత్రాలతో ఎట్టకేలకు విజయాలను అందుకుంది. అయితే... ఆ విజయాల తాలూకు ఆనందాన్ని ఎంజాయ్ చేయడానికి వీలు లేకుండా చేస్తున్నారట మీడియా సోదరులు. సినిమాల గురించీ, పాత్రల గురించి మాట్లాడకుండా... వ్యక్తిగత విషయాల గురించే ప్రశ్నలు సంధిస్తున్నారట. దానికి కూడా తనేం ఫీలవ్వలేదట కానీ... తన బోయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోస్ గురించి బోల్డ్ గా ప్రశ్నలు సంధిస్తున్నారట. వినడానికే ఇబ్బందిగా అనిపించే ఆ ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పను? అని ఆవేదన వ్యక్తం చేస్తోంది ఇలియానా. ‘ఆండ్రూ నా ఫ్రెండ్ మాత్రమే అని మొదట్టో చెప్పిన మాట నిజం.
అయితే.. కాలక్రమేణా మా స్నేహం ప్రేమగా పరిణమిల్లింది. ఆ తర్వాత నేనే చెప్పాను... తనతో డేటింగ్ చేస్తున్నాను. తప్పేంటి? అని. నా జీవిత భాగస్వామి అవ్వదగ్గ అన్ని అర్హతలూ ఆండ్రూలో ఉన్నాయ్. త్వరలో మేం పెళ్లాడతాం. అయితే.. ఎప్పుడో చెప్పలేను. ఇవన్నీ వివరంగా చెప్పినా.. మా విషయంలో వికృతమైన ప్రశ్నలు అడుగుతున్నారు’అని ఉద్వేగానికి లోనయ్యింది ఇలియానా. ‘తెల్లగా ఉంటాడు కాబట్టే... ఆండ్రూతో మీరు డేటింగ్ చేస్తున్నారటగా? మీకు తెల్లగా ఉండేవారంటే ఇష్టం అటగా? ఇవేనా ఓ ఆడదాన్ని అడగాల్సిన ప్రశ్నలు? నేను పబ్లిక్ ఫిగర్ ని మాత్రమే. పబ్లిక్ ప్రాపర్టీని కాదు. మీ అమ్మ, మీ అక్క, మీ చెల్లి లాగానే... నేనూ ఆడదాన్నే. అది గుర్తుంచుకోండి’ అంటూ మీడియాకు ఘాటుగా సమాధానం ఇచ్చింది ఇలియానా.
Also Read