అతడితో ఇలియానా విడిపోయిందా?
on Aug 27, 2019
ఇలియానా తన జీవన సహచరుడు ఆండ్రూ నీబోన్‌తో విడిపోయిందా? ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఇదే! అయితే దీనిపై ఇలియానా మాత్రం ఇప్పటిదాకా నోరు విప్పలేదు. రెండేళ్లుగా ఇలియానా, ఆండ్రూ సహజీవనం చేస్తున్నారు. తన సుదీర్ఘ కాల బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ తన సహచరుడు అయ్యాడంటూ 2017 డిసెంబర్‌లో ఒక ఫొటోగ్రాఫ్‌ను షేర్ చేసింది. అయితే ఆండ్రూను పెళ్లాడిందీ, లేనిదీ మాత్రం బయట ఎక్కడా, ఎప్పుడూ ఆమె ప్రస్తావించలేదు. సోషల్ మీడియాలో మాత్రం అతడితో కలిసున్న ఫోటోలను ఆమె షేర్ చేస్తూ వస్తోంది. కాగా ఇన్‌స్టాగ్రాంలో వాళ్లు ఒకరినొకరు 'అన్‌ఫాలో' కావడంతో.. ఇద్దరూ విడిపోయారనే ప్రచారం మొదలైంది. పైగా.. ఇప్పటివరకూ తాను పోస్ట్ చేసిన ఆండ్రూ ఫొటోలన్నింటినీ ఇలియానా తొలగించేసింది కూడా.
వైవీఎస్ చౌదరి డైరెక్ట్ చేసిన 'దేవదాస్' మూవీతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన ఇలియానా, దాని తర్వాత మహేశ్ జోడీగా చేసిన 'పోకిరి' సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారింది. అప్పట్నుంచి నాలుగైదేళ్ల పాటు టాలీవుడ్‌లో తిరుగులేని నాయికగా చలామణీ అయిన ఈ గోవా బ్యూటీ.. తర్వాత బాలీవుడ్‌కు తరలిపోయింది. ఇటీవలే రవితేజ సినిమా 'అమర్ అక్బర్ ఆంటోనీ' మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించినా, వాళ్లు పట్టించుకోలేదు. ప్రస్తుతం ఆమె జాన్ అబ్రహాం జోడీగా 'పాగల్‌పంతి' అనే బాలీవుడ్ మూవీలో నటిస్తోంది.