ఆ హీరోతో డేటింగ్ చేసి హర్మోన్లు పెంచుకున్న ఇలియానా..!
on Jul 11, 2017
ఇలియానా... ఈ పేరు వింటే, కొన్నాళ్ల క్రితం వరుకూ కుర్రకారు గుండెల్లో గంటలు మోగేవి. ఇప్పుడైతే అంత సీన్ లేదనుకోండీ..!
ఈ ముద్దుగుమ్మ మాత్రం... అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన స్పైసీ ఫొటోలను పోస్ట్ చేస్తూ.. యువతరాన్ని ఆకట్టుకోవడానికి సర్వశక్తులా ప్రయత్నిస్తుంటుంది. ఇప్పుడైతే... ఏకంగా టాలీవుడ్ లో తాను కొనసాగించిన తన అఫైర్ గురించి మీడియా ముందు బయటపెట్టి సంచలనానికి తెరలేపింది ఇలియానా.
‘‘పదిహేనో ఏట సినిమాల్లోకొచ్చాను. ఆ సినిమా పేరు ‘దేవదాసు’. తెలుగు సినిమా. అమెరికాలో షూటింగ్ అనగానే ఒప్పేసుకున్నా. చివరకు అదే నా జీవితం అయింది.’’
‘‘అప్పట్లో నాకు హార్మన్ల ప్రాబ్లమ్ ఉండేది. ఆ సమస్య నుంచి అధిగమించడానికి ఓ టాలీవుడ్ హీరోతో దాదాపు మూడేళ్లు డేటింగ్ చేశాను. అయితే.. మా ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో విడిపోయాం. ఇదేం పెద్ద విషయంగా నేను భావించడం లేదు’’
‘‘పాత్రల కోసం పడక గదికి చేరుకోవడం అనేది సదరు హీరోయిన్ల మనస్తత్వాలపై ఆదారపడి ఉంటుంది. తమ టాలెంట్ ని నమ్ముకున్న ఏ హీరోయిన్ కూడా అలాంటి పొరపాటు చేయదు’’
‘‘నటిగా నా కెరీర్ సంతృప్తినే ఇచ్చింది. అయితే... బాలీవుడ్ వైపు నేను చూడటం కరెక్ట్ కాదని చాలామంది అంటుంటారు. నాకు హిందీ సినిమా అంటే ఇష్టం. అందుకే వెళ్లాను. అక్కడ అనుకున్న సక్సెస్ రానందుకు నేనేం ఫీలవ్వడం లేదు. జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా సాగదు’’ అని చెప్పుకొచ్చారు ఇల్లూబేబీ.
ప్రస్తుతం ఇలియానా ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో పీకల లోతు ప్రేమలో కూరుకుపోయి ఉంది. త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నట్లు ఇటీవల తెలిపింది కూడా.
బాలీవుడ్ లో హీరోయిన్ల కొదవ లేదు. లెక్కకు మించిన అందాలు బాలీవుడ్ తెరను మెరిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తన లాంటి హీరోయిన్లకు అక్కడ ఏ మేరకు స్థానం ఉంటుందో ఇలియానా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘ముబారక్’ చిత్రంలో అర్జున కపూర్ కి జోడీగా నటిస్తోంది. ‘బాద్ షాహో’ అనే మరో సినిమా కూడా చేస్తోంది.