ఇలియానాకు కొత్త ఇల్లు కావాలట!
on Nov 13, 2019
ముంబైలో ఇలియానాకు ఓ ఇల్లు ఉంది. అందులో ఆమె సౌకర్యవంతంగా, హాయిగా ఉంటోంది. అయితే, ఇప్పుడు ఇలియానా మరో ఇల్లు కోసం వెతుకుతోంది. ఎందుకంటే... ప్రస్తుతం ఉంటున్న ఇంటి ముందు సముద్రం లేదని అంటోంది. ఇలియానాకు ఇంటి ముందు సముద్రం కావాలట. నాజూకు నడుము గల ఈ సుందరి గోవాలో పుట్టి పెరిగింది. గోవా అంతా సముద్రమే.
గోవాలో ఇలియానా ఇల్లు సముద్రం ముందే. చిన్నప్పుడు ఇంటి నుండి బయట అడుగు పెడితే ఆమెకు సముద్రం కనిపించేది. అంతేనా? బాల్కనీలో కూర్చున్నా కళ్ళ ముందు సముద్రం కనిపించేది. అందుకని, ముంబైలో కూడా సీ ఫేసింగ్ ఫ్లాట్ కోసం ఇలియానా సెర్చ్ చేయడం స్టార్ట్ చేసింది. వచ్చే ఏడాదికి తప్పకుండా కొంటానని ఆమె చెబుతోంది. 33 ఏళ్ళ ఇలియానా కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. అతడి జ్ఞాపకాల నుండి దూరంగా వెళ్లడానికి ఇల్లు మారుతుందేమో. ప్రస్తుతం ఉన్న ఇంటిలో ఆండ్రూతో ఆమె చాలా రోజులు సహా జీవనం చేసింది.
Also Read