సింధు స్వర్ణంతో సినిమా క్లైమాక్స్ మారింది
on Aug 27, 2019
ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు స్వర్ణం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. అంతే కాదు, ఒక సినిమా క్లైమాక్స్ కూడా మార్చింది. పీవీ సింధు జీవితం ఆధారంగా ఒక బయోపిక్ తెరకెక్కుతోంది. నటుడు సోనూ సూద్ ఆ సినిమాపై వర్క్ చేస్తున్నారు. ఆయన సింధు కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్ర పోషించడంతో పాటు సినిమాను నిర్మిస్తున్నారు. రెండేళ్లుగా సింధు బయోపిక్ పనులు జరుగుతున్నాయి. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పథకం నెగ్గిన తరవాత స్క్రిప్ట్ రీరైట్ చేస్తున్నామని సోనూ సూద్ తెలిపారు. ఈ విజయంతో సినిమాకు శుభం కార్డు వేయనున్నట్టు స్పష్టం చేశాడు. ఇంతకు ముందు రాసిన కథలో చేర్పులు చేస్తున్నారన్నమాట. దేశం గర్వపడేలా చేసిన సింధు, మరిన్ని విజయాలు సాధిస్తుందని సోనూ సూద్ తెలిపారు.